పర్చూరు నుంచి వైస్సార్సీపీ తరుపున దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీ చేయబోతుండటంతో పోటీ హోరా హోరీగా తయారైంది. 2014 లో అక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నారు. 2014 లో అక్కడ ఘనవిజయం సాధించారు. అయితే ఈ బలమైన నేత దగ్గుబాటి దింపడంతో పోటీ హోరా హోరిగా మారింది. నిజానికి దగ్గుబాటి తనయుడు  హితేష్ పోటీ చెయ్యాలి. కానీ హితేష్ కు బదులగా వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేశారు .


పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఢీ కొట్టడానికి వెంకటేశ్వరరావే సరైన అభ్యర్థి అని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి కూడా తెప్పించుకున్న సర్వే నివేదికల్లో కూడా ఈ విషయమే తేలినట్లు స్పష్టమైంది. హితేష్ కంటే కూడా ఆయన తండ్రిని అభ్యర్థిగా నిలబెట్టి, గెలిపించుకోగలిగితే.. అసెంబ్లీలోనూ జగన్ కు సహాయకారిగా ఉంటారనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. వెంకటేశ్వరరావును మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని కూడా చెబుతున్నారు.


దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయానా తోడల్లుడు. ఆయన గుట్టమట్లు అన్నీ వెంకటేశ్వరరావుకు తెలుసనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు చేసిన కుట్రలపై వెంకటేశ్వరరావు ఇదివరకే ఓ పుస్తకాన్ని కూడా ముద్రించారు. అయితే ఇప్పుడు పర్చూరు లో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టంగా ఉంది. ఎవరు గెలిచినా కొంచెం మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: