ఆంధ్రుల మీద మోదీకి కోపం, ఆంధ్రుల మీద కేసీఆర్ కి కోపం, ఆంధ్రుల మీద జగన్ కి కోపం... ఇవే గత మూడు వారాలుగా తెదేపా సానుభూతి మీడియాలో గంటకొకసారైనా కనిపించే చంద్రబాబు మాటలు.


రాజకీయ పార్టీల పరమావధి అధికారం, ప్రజాస్వౌమ్యంలో అధికారం కట్టబెట్టేవారు ప్రజలు..ప్రజలే.  మరి పైన చెప్పిన బిజెపి, వైసీపీ, మిగిలిన పార్టీలందరూ ప్రజలను మంచి చేసుకొని...వారి ఆశీర్వాదాన్ని కోరుకుంటారా..లేక వారి మీద కోపం, ద్వేషం పెంచుకొని వారికి దూరమవుతారా?


ప్రజల మీద కోపం, ద్వేషం చూపించి ప్రజాస్వౌమ్యంలో ఏ పార్టీ అయినా మనగలదా? బ్రతికి బట్ట కట్టగలదా?  18 ఏళ్లు నిండనివారికి కూడా స్మార్ట్ ఫోన్ వాడినంత సులువుగా ఈ విషయాలు అర్థం అవుతుంటే.. నలభై ఏళ్ళ రాజకీయ జీవితం...ఏడు పదులు నిండిన వయస్సు గల చంద్రబాబు గారు ఇలా ఎలా చెబుతున్నారు అని ఆశ్చర్యపోతున్నారు ఆంధ్రప్రజ, రాజకీయ విశ్లేషకులు. 


వర్షాల్లేక, కరువుతో అల్లాడుతున్న మా అసలయిన కష్టాల గురించి కాకుండా...కేసీఆర్ మాతో పొత్తెట్టుకోలేదు కాబట్టే ఆయనకు మీ మీద కోపం, బిజెపి నుంచి మేం బయటకు వచ్చాం కాబట్టి మోదీకి మీ మీద కోపం వంటి లేని -పోని కష్టాలు మాకు చుట్టొద్దు... మాకు - మాకే బతుకీడవలేనన్ని దుర్భర కష్టాలున్నాయి.  వాటిని తీర్చమని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే ఐదేళ్ళ తరువాత మీ వ్యక్తిగత, పార్టీ కష్టాల్ని మా నెత్తిన రుద్దకండి మహాప్రభో అంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: