జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మీద విమర్శలు చేయకుండా కేవలం జగన్ మీదే విమర్శలు చేయడంతో పవన్ పార్టీకి డామేజ్ జరగడం ఖాయమని విశ్లేషణలు జరుగుతున్నాయి. జగన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీకి విజయం దక్కే ఛాన్స్ లేదని - జగన్ సీఎం అయ్యే అవకాశాలే లేవని కూడా పవన్ కుండబద్దలు కొట్టారు. ఇందుకు గల కారణాలను కూడా ప్రస్తావించిన పవన్... తనదైన శైలి లెక్కలను చెప్పుకుపోయారు. ఇందులో మొదటి కారణంగా టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రిడిక్షన్స్ ను ప్రస్తావించారు.


2014లో ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని - జగన్ సీఎం కావడం ఖాయమని కేసీఆర్ చెప్పారని అయితే అందుకు విరుద్ధంగా జరిగిందని పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా కేసీఆర్ 2014 మాదిరిగానే ఇప్పుడు కూడా జగనే ఏపీ సీఎం కాబోతున్నారని చెబుతున్నారని - అయితే గతంలో జరిగినట్లుగానే కేసీఆర్ అంచనాలు తప్పడం ఖాయమేనని తేల్చేశారు.ఇక పవన్ చెప్పిన రెండో కారణం ఏమిటంటే... తిరుమలకు చెప్పులతో వెళ్లిన జగన్ సీఎం ఎలా అవుతారని లాజిక్ లాగారు.


తిరుమలకు చెప్పులతో వెళ్లిన జగన్ సీఎం అయ్యే ఛాన్స్ లేదని పవన్ తనదైన లెక్క చెప్పారు. ఈ రెండు కారణాలనే ఆధారం చేసుకున్న పవన్... ఈ ఎన్నికల్లోనూ వైసీపీ కి విజయం దక్కదని - జగన్ సీఎం కాలేరని కూడా చెప్పుకొచ్చారు. అయితే మరి జగన్ సీఎం కాకుంటే... ఏపీకి కాబోయే సీఎం ఇంకెవరన్న విషయాన్ని ప్రస్తావించగా... కొద్దిసేపు నీళ్లు నమిలిన పవన్... ఈ ఎన్నికల్లో తన పార్టీ జనసేన విజయం సాధిస్తుందని తానే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నానంటూ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: