ఎన్నికల్లో గెలవడానికి అనేక విధా నాలు ఉంటాయి. ఒక్కో మెట్టు ఎక్కి చివరాఖరు అంకానికి చేరుకున్నాక అక్కడ చేయాల్సిందే పోల్ మేనేజ్మెంట్. ఇది మొత్తం అన్ని అంకాల్లోకెల్లా చాలా కష్టమైనైది. క్లిష్టమైనది. ఓ విధంగా చెప్పాలంటే ఓ కుర్రాడు పరీక్షకు ముందు ఎంత బాగా ప్రిపేర్ అయినా పరీక్షా హాల్ లో మూడు గంటలు చదివిన దాన్ని ఎంత సమర్ధంగా  కాగితం మీద జవాబులుగా రాయగలడన్న దాని మీదనే అతనికి ర్యాంకులు రావడం ఆధారపడి ఉంటుంది.

 


అన్ని పార్టీలకూ మిగిలిన విద్యలు తెలుసు. తెలియకపోతే సాయం తీసుకోవచ్చు. ఉదాహరణకు ప్రచారంలో స్టార్ కాంపెనియనర్లను దింపుకోవచ్చు. అలాగే జనాన్ని ఆకట్టుకునేలా ప్రసంగాలు తయారు చేయించుకోవచ్చు. జనాలను కూడా తెచ్చుకవచ్చు. డబ్బు పెట్టి ఇవన్నీ చేసి అనుకూల పవనాలను మనకే అని కూడా మీడియాను మేనేజ్ చేసి రాయించేసుకోవచ్చు. కానీ ఆఖరి ఘట్టం మాత్రం ఎంతో అనుభవం, అవహాగన, పూర్తి కో ఆర్డినేషన్ ఉంటేనే తప్ప చేయలేనిది. అదే పోల్ మేనేజ్మెంట్.

 


 

పోల్ మేనేజ్మెంట్ తెలిసిన పార్టీలు కలకాలం అధికారంలో ఉంటాయి. మరీ ప్రభంజనం వీస్తే తప్ప చెప్పలేం కానీ,  మిగిలిన టైంలో వారికి అంతా అనుకూలం చేసుకుంటారు. ఇక ఓటర్లను పోలింగు బూతుల వద్దకు రప్పించి వారిని ఓటు వేయించుకోవడం. వారు తమ పార్టీకే ఓటేసేలా చూసుకోవడం అన్నది చాలా ప్రధానం. ఓ పోలింగ్ బూతులో ఉన్న ఓట్లలో తమ పాటీకి పడే ఓట్లను మొత్తానికి మొత్తం వేయించుకోగలిగితే హిట్ అయినట్లే. ఈ విషయంలో అంకితభావం, పార్టీ పట్ల నిబద్ధత. గెలవాలన్న కసి ఉండాలి. గాలివాటంలా ఇలా వచ్చాం, వెళ్ళాం అంటే మాత్రం అసలుకే ఎసరు వస్తుంది. మరి. ఏపీలో ఈసారి ఎన్నికలు అన్ని విషయాలతో పాటు పోల్ మేనేజ్మెంట్ మీద కూడా బాగా అధారపడిఉన్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: