ఎన్నికల వస్తున్నాయంటే ఒకప్పుడు ఓటరు ఎలాంటి నాయకుడికి ఓటు వేయాలా అన్న ఆలోచనలో ఉండే వారు.  అలాగే అభ్యర్థులు కూడా తాము ఈ మంచి పని చేశాము..అందుకు మాకు ఓటు వేయండి అని ఓటర్లను ప్రార్థించే వారు.  కానీ కొంత కాలంగా ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల సీజన్ అభ్యర్థులకు ప్రాణసంకటంగా..ఓటర్లకు పండుగ వాతావరణంలా మారింది.  ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు డబ్బు, మద్యం, వస్తు రూపేనా సమర్పించాల్సిన పరిస్థి వచ్చింది..ఒకవేళ అలా చేసినా కూాడా ఓట్లు పడతాయా..లేదా అన్న పరిస్థితి నెలకొంది.  ఇక దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ  కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభాల పర్వానికి నేతలు తెరతీసే క్రమంలో వాహనాలలో తరలించేస్తున్నారు.


నేతలు ఎన్నో రకాలుగా డబ్బులు తరలించే ప్రయత్నాలు చేస్తున్నా..పోలీసులు మాత్రం గట్టి నిఘా ఉంచి వాటిని పట్టుకుంటున్నారు.  దేశ వ్యాప్తంగా.. జరుగుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.528.98 కోట్లు సీజ్ చేశారు. అలాగే రూ.186.19 కోట్ల విలువైన మద్యం, రూ.33.38 కోట్ల విలువైన బంగారం, రూ.725.35 కోట్ల విలువైన డ్రగ్స్, స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఓట్లరు ప్రలోభ పెట్టేందుకు పలు వస్తువులను కూడా నేతలు పంపిణీ చేస్తున్నారు.   తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం పర్వం ముగియడం తో పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయింది.


ఏప్రిల్ 11న పోలింగ్ జరనున్న నేపథ్యంలో ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు.  ఇదే క్రమంలో పోలింగ్‌కు ముందు ఓటర్లను మద్యం, డబ్బులతో ప్రలోభపెట్టే అవకాశం ఉండడంతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా  మొత్తం 3.93 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో 2,186 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 25 లోక్‌సభ స్థానాలకు 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: