రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఎక్కువగా మైనార్టీలు ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల గనుక అధికార పార్టీ టిడిపి వైసిపి పార్టీని దెబ్బ కొట్టాలని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన నాటినుండి జగన్ బీజేపీతో కలిసిపోయారని మోడీకి జగన్ మునిగిపోయారని చేసిన విష ప్రచారాన్ని ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో జగన్ కర్నూలు ప్రాంతంలో తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు.


2014 ఎన్నికల సమయంలో దేశమంతటా మోడీ గాలి ఉందని ఆ సమయంలోనే నేను బీజేపీతో కలవలేదు ప్రస్తుతం దేశంలో బీజేపీ పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఇటువంటి ఈ క్రమంలో నేను బీజేపీతో కుమ్మక్కయ్యాయని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ప్రజలంతా నమ్మవద్దని ముఖ్యంగా మైనార్టీలకు..నేను చెప్పేది ఏమిటంటే ఏదైనా మీ దాకా రావాలంటే నన్ను దాటి రావాలని జగన్ సంచలన కామెంట్లు చేశారు.


కేంద్రంలో ఎవరు వచ్చినా రాష్ట్రంలో రాబోయేది మన ప్రభుత్వం అని కనుక వైసీపీ పార్టీ బిజెపి పార్టీతో కలిసి ఉంది అని విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు మాటలను నమ్మవద్దని జగన్ సూచించారు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు సిద్ధమవుతారని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను నమ్మవద్దని ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు అవినీతి మయం చేశారని మరొకసారి మోసపోవద్దని జగన్ పేర్కొన్నారు.


మొత్తం మీద బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారు అనే విష ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ కి చెక్ పడేలా జగన్ క్లారిటీ ఇవ్వడంతో కర్నూలు ప్రాంతంలో ఉన్న మైనార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలను గెలిపించడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: