చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ఉందనగా  వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీగా ఉండాల్సిన చంద్రబాబు ఎన్నికల కమీషన్ కార్యాలయం ముందు ధర్నా చేయటమేంటి ? ఏమిటంటే, రేపటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే అందుకు కారణం ఎన్నికల కమీషన్ పై దుమ్మెత్తిపోయటానికే. ప్రధాన ప్రతిపక్షం వైసిపితో కుమ్మక్కై తమ ఓటమికి కారణమైందని ఈసికి దుమ్మెత్తిపోయటానికి చంద్రబాబు అవసరమైన రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లే అనుమానిస్తున్నారు.

 

రేపటి ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశం టిడిపికి లేదనే ప్రచారం ఉదృతంగా జరుగుతోంది. దానికి తగ్గట్లే జనాలు కూడా టిడిపి అభ్యర్ధులపై ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. చివరకు మంగళగిరిలో పోటీ చేస్తున్న సుపుత్రుడు నారా లోకేష్ కూడా జనాల నిరసన తెగను భరించక తప్పలేదు. చివరకు ప్రచరం ముగిసిన తర్వాత మొదలైన ప్రలోభాల్లో కూడా టిడిపికి చుక్కెదురే అవుతోంది.

 

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న టిడిపి నేతల ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మద్యం, డబ్బుతో పాటు ఏసిలు, రిఫ్రిజిరేటర్ల లాంటి వాటిని పోలీసులు ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. దాంతో టిడిపి నేతల్లో తీవ్ర అసహనం బయటపడుతోంది. అందుకనే అనంతపురం, మంగళగిరి, నెల్లూరు, మచిలీపట్నం, తిరుపతి, చంద్రగిరి లాంటి చోట్ల బాగా గొడవలవుతున్నాయి.

 

వాస్తవాలు ఇలా ఉంటే ఈసి వైసిపి జేబు సంస్ధగా మారిపోయిందని చంద్రబాబు ఎదురు దాడి చేస్తున్నారు. నేరుగా ఎన్నికల సంఘం  వైసిపికి ప్రచారం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని అంటున్నారంటే చంద్రబాబులో ఎంత అక్కసు పేరుకుపోయిందో అర్ధమవుతోంది. తనకు జేబులో మనుషులుగా ఉన్న ఉన్నతాధికారులను బదిలీ చేసిందన్న అక్కసు చంద్రబాబులో కనబడుతోంది. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు ఈసి కార్యాలయం ముందు ధర్నాకు దిగటం దేనికి సంకేతం ?

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: