వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని చివరిదాకా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే లేక ప్రజలలో ప్రచారం చేయలేకపోయిన చంద్రబాబు చేతిలో ఉన్న అధికారాన్ని ఇప్పటికే విచ్చలవిడిగా వాడుతున్న సంగతి అందరికీ తెలిసినదే.


ఈ నేపథ్యంలో చంద్రబాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా ఎలాగైనా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావాలని రకరకాల కథనాలు మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సానుభూతి పుట్టించే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిన్నటి తోనే ఎన్నికల ప్రచారం ముగియటంతో చంద్రబాబు ఎలాగైనా రాబోయే ఎన్నికలలో గెలవాలని ఈసీ ఆదేశాలను వ్యతిరేకించేలా ప్రజలను గందరగోళానికి గురి చేసేలా మీడియాకు లీకులిస్తూ కుట్ర పన్నుతున్నట్లు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు.


ముఖ్యంగా అధికారుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయాలు బయట పడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే సదరు అధికారులపై బదిలీల ఆదేశాలు జారీ చేయడంతో ఆగ్రహం తో చంద్రబాబు ఏదోవిధంగా ధర్నాలు ఎన్నికల కమిషన్ ఆఫీస్ దగ్గర చేయాలని ఇందుమూలంగా ముందుగానే తనకు అనుకూలంగా ఉండే మీడియాకు లీకులు ఇస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు పేర్కొంటున్నారు.


మొత్తం మీద ఎన్నికల ప్రచారం అయిపోయాక కూడా తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా ప్రజల్లో కనబడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోందని ఈ క్రమంలో మీడియాను చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారని ఇటువంటివి నేర్చుకోవాలంటే టిడిపి ని చూసి నేర్చుకోవాలి అని అంటున్నారు విశ్లేషకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: