ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగియటంతో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మైకులు కట్ చేసుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎలాగైనా ప్రజలలో మైలేజ్ సంపాదించుకోవడానికి టీవీలో కనబడటానికి నానా తంటాలు పడుతున్నట్లు ప్రస్తుతం ఏపీ మీడియాలో జరుగుతున్న తీరును చూస్తుంటే తెలుస్తుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


నిన్నటితో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఎవరికి వారు వాళ్లకి వెళ్లి ఓటు వేయడానికి రెడీ అయిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎన్నికల కమిషన్పై చిర్రుబుర్రులాడుతూ ఈ సి ఎవరు ఎన్నికలు ఎలా చేసుకోవాలో మాకు తెలుసు అంటూ ఇష్టమొచ్చినట్లు రీతిగా బెదిరింపు ధోరని లో చంద్రబాబు మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.


అయితే చంద్రబాబు వ్యవహరిస్తున్న ధోరణి చూసి ఏపీ లో ఉన్న ప్రజలు మరియు సీనియర్ రాజకీయ నేతలు చంద్రబాబు కి భయం పట్టుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అలజడులు సృష్టించి ఏదో విధంగా లబ్ధి పొందాలని చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు టార్గెట్ చూస్తుంటే ఎన్నికల ముగిసేంత వరకు టీవీలో కనపడాలని పరోక్షంగా ప్రచారం చేసుకునే విధంగా ల్యాండ్ చేసుకున్నారని ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు వైసిపి పార్టీకి చెందిన నాయకులు.  



మరింత సమాచారం తెలుసుకోండి: