ఏపీలో తెల్లారుతూనే ఓటర్లంతా బారులు తీరారు. తమ పోలింగ్ స్టేషన్లను వెతుక్కుంటూ పవిత్రమైన ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పరుగులు తీశారు. ఏడు గంటలకు పోలింగ్ మొదలవుతుందంటే ఆరు  నుంచే భారీ ఎత్తున క్యూ లైన్లు దర్శనమిచ్చాయి.

 

యువత మొదలుకుని,  మహీళలు, వ్రుద్ధులు ఈసారి ఓటింగులో ఎక్కువగా కనిపించారు. ఓటు వేయాలన్న  జనం ఉత్సాహం చూస్తూంటే ఇది దేనికి సంకేతం అన్న ఆలొచనలు వస్తున్నాయి. గతంలో ఓటింగ్ కి దూరంగా వుండే మధ్యతరగతి వర్గాలు సైతం ఈసారి ఓటింగుకు రావడం ఓ గొప్ప మార్పుగా చూస్తున్నారు.

 

ఇక గంటల తరబడి క్యూ కట్టి అయినా తమ ఓటు వేయాలన్న పట్టుదల అయితే ఓటర్లలో కనిపిస్తోంది. విశాఖలో అనేక పోలింగ్ స్టేషన్లలో తెల్లారుతూనే సందడి వాతావరణం నెలకొంది. మరి దీన్ని కనుక ఓ అంచనాగా తీసుకుంటే మాత్రం ఏపీలో గొప్ప మార్పునకు ఈ ఓటింగ్ దోహదపడుతుందని చెప్పాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: