రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అంతకన్నా ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవటమంటే దేనికి సంకేతాలు ? ఆడ, మగా తేడాలేకుండా చివరకు వయస్సు అయిపోయిన వాళ్ళు కూడా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

 

ఒక అంచనా ప్రకారం ఎక్కువమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటే టిడిపికే నష్టం. ఎందుకంటే, చంద్రబాబునాయుడు పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా జనాల స్పందన బ్రహ్మాండంగా ఉన్న విషయం అందరూ చూసిందే. జగన్ పాదయాత్రకు అంత స్పందన ఎందుకు వచ్చింది ? ఎందుకంటే, జగన్ కు పాజిటివ్ స్పందన కన్నా చంద్రబాబు మీద మైనస్సే ప్రధాన కారణమని చెప్పాలి.

ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో చాలా వర్గాలు మండిపోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అందుకనే పోలింగ్ మొదలుకాగానే జనాలు బారులుతీరారు. దానికితోడు ఏపి జనాలకు బోనస్ అన్నట్లు తెలంగాణా నుండి కూడా లక్షలాది మంది ఓటర్లు ఏపికి చేరుకున్నారు.  అధికారపార్టీని దింపేయాలన్న కసి ఉంటేనే జనాలు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉదయం నుండే పోటెత్తుతారు. మధ్యాహ్నం 1 గంటకు 35 శాతం ఓట్లు పోలయ్యాయి.


అదే అధికార పార్టీ మీద వ్యతిరేకత లేకపోయినా, ప్రతిపక్ష పార్టీపై ఎటువంటి అంచనాలు లేకపోయినా ఓటర్లలో నిరసక్తత చోటు చేసుకుంటుంది. నిరాకసక్తంగా ఉన్న ఓటర్లు ఉదయం నుండే బారులుతీరరు. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కూడా రుజువైందదే. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కూడా జనాలు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరిని విషయం అందరూ చూసిందే.

 

దానికితోడు ఏపిలోని ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందుకనే జగన్ తన పాదయాత్రను కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇపుడు ఎక్కువగా పోలింగ్ జరుగుతున్నా, గొడవలు జరుగుతున్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే కావటం గమనార్హం. కాబట్టి పోలింగ్ శాతం పెరిగేకొద్దీ టిడిపికి నష్టమనే అంచనాలు పెరిగిపోతున్నాయి. పోయిన ఎన్నికల్లో 78 శాతం ఓటింగ్ నమోదైంది. మరి ఈ పోలింగ్ లో ఎంత శాతం నమోదవుతుందో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: