ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల కమిషన్ కు విశేష అధికారాలున్నా ఆ అధికారాలన్నీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరపడానికే.. రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగ-మంత్రాంగాలు సాగుతునే ఉంటాయి ఎన్నికల కమిషన్ తోపాటుగా.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కదా?  తెదేపా చీమకు పేపరడ్డమొచ్చినా కొత్త సాంప్రదాయాలను నెలకొల్పుతూ.. ఎన్నికల కమిషన్ ను కలిసి వినతి పత్రమిచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దేశ ఖ్యాతి గడించారు కదా?  తెదేపా కార్యకర్తల మీద దాడులంటూ డీజీపీకి సాక్షాత్తు తాను స్వయంగా సంతకం పెట్టి మరీ వినతీ పత్రం పంపించారు కదా?  కోడెల మీద, తెదేపా కార్యకర్తల మీద జరిగిన ప్రతిదాడిని ఖండిస్తున్నారు కదా?


మరి చంద్రబాబు గారు తెదేపా అధినేత మాత్రమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కదా... అలాంటపుడు అనంతపురంలో వైసీపీ కార్యకర్తలను వేటకొడవళ్ళతో వెంటాడి చంపారంటూ వస్తున్న వార్తలను, నరసరావుపేట లో సాక్షాత్తు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద గొడ్డలితో దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలను, సత్తినపల్లి, జమ్మలమడుగు, అనంతపురాల్లో వైసీపీ వారిమీద తెదేపా కార్యక్తలు రాళ్ళు రువుతూ తీవ్రంగా గాయపర్చారు అంటూ వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి గా ఖండించాలి కదా? చంద్రబాబు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రే కదా..కాదా..అంటూ అయోమయంలో ఉన్నారు ఆంధ్రప్రజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: