‘లవ్ మీ ఆర్ హేట్ మి.. బట్ నాట్ ఫర్ గెట్ మీ’- ప్రేమించు లేదా కనీసం ద్వేషించు కానీ నన్ను మాత్రం మరచిపోకు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఈ కొటేషన్ పదే-పదే గుర్తుకు చేస్తుందంటున్నారు ఆంధ్రప్రజ.


2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్, పవన్, చంద్రబాబు, కెఎ పాల్ అనే నాయకులు  వారి పార్టీల మద్య జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం దాదాపు 7 గంటల నుంచి మొదలయిన బాబోరి వార్తలు, అవిశ్రాంతంగా, ధారాళంగా వస్తూనే ఉన్నాయి.  అవి చాలవన్నట్లు బాబోరు ఓటర్లకు చేసే వినమ్ర విజ్ఞప్తులు.. ఇది ఎన్నికల ప్రచారమా లేక బాబోరి డిజటిల్ ప్రచారమా అన్నట్లుంది పరిస్థితంటున్నారు ఆంధ్రప్రజ.


ముందు 30 శాతం ఈవీఎంలు పనిచేయట్లేదని ఎన్నికల అధికారిని కలిశారంటూ వార్తలు,  అలా అన్నారు, ఇలా అన్నారు అంటూ వార్తలు, తరువాత డీజిపికి  లెటరు రాసారంటూ వార్తలు, అలా అన్నారు..ఇలా అన్నారంటూ, మళ్లీ రీ - పోలింగ్ అన్నారంటూ వార్తలు..దానికి కూడా అలా అన్నారు..ఇలా అన్నారంటూ వార్తలు.. వెనక్కి వెళ్లిన ఓటర్లు వచ్చి ఓట్లేయాలని వినమ్ర విజ్ఞప్తులు, దానికి ఛానెళ్ళ బ్రేకింగులు, దీనికి కొసమెరుపేమిటో తెలుసా రాష్ట్రం కోసం ఒక్కరోజు మీరు కష్ట పడండంటూ..తన ఎన్నికల ప్రచార నినాదాన్ని ఇన్ డైరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకు వెళ్ళే పిలుపు. 



దానికి ఛానెళ్లు తెగ హడావుడి - బ్రేకింగ్ న్యూస్ లు.. ఎడతెరిపి లేని బాబోరి వార్తలు ఛెడా-మడా ఓటరును ఓటింగ్ రోజుల్లో కూడా ముంచి తేలుస్తుంటే ఎలా ఇది ఓటర్లు భావోద్వేగానికి గురవరా..ఇది నైతికమేనా అని మధన పడుతున్నారు ప్రజాస్వౌమ్య వాదులు.


బాబోరి పరిస్థితి ఇంత ఘనంగా ఉంటే..జగన్, పవన్, పాల్ లాంటి మిగిలిన పార్టీ నాయకులు ఊసే లేదు వార్తా ఛానెళ్ళలో.. ఏంటండీ ఘోరం, దుర్మార్గం కదా.. ప్రజలు అర్థం చేసుకోలేనుకుంటున్నారా? ఈ మీడియా ఛానెళ్లు తెదేపా నాయకులు, చంద్రబాబు అంటూ అసహనాన్ని వ్యక్తం చేసున్నారు ఆంధ్రప్రజ.


మరి చూడాలి ఈ విషయాలను ఎన్నికల కమిషన్ ఎలా చూస్తుందో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: