ఉదయం 10 గంటల దాకా ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా రాష్ట్రంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు వైసిపి పార్టీకి చెందిన నాయకుల పై మరియు పోలింగ్ బూత్ లో ఉన్న వైసిపి పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.


అయితే ఒక పక్క దాడులు జరుగుతున్న కానీ ఓటర్లు మాత్రం ఏ మాత్రం భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ముఖ్యంగా గత ఎన్నికల కంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలలో చైతన్యం కలిగిందన్న సంతృప్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.


ఇదిలా ఉండగా పోలింగ్ బూత్ లలో ప్రశాంతంగా ప్రజలు ఓట్లు వేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు హింసాత్మక సంఘటనలతో భయభ్రాంతులకు గురి చేస్తు టీడీపీకి కొమ్ముకాసే ఎల్లో మీడియాలో వైసీపీ నేతల పై బురద జల్లుతున్న క్రమంలో వైసీపీ పార్టీ పై దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ సాయి రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


ముఖ్యంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వేటకొడవళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులకు పాల్పడుతున్నట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్రమంలో దాడులను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: