ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో చాలా విషయాల్లో తాము రికార్డు క్రియేట్ చేశామని చెప్పకోవడానికి ఎప్పుడూ తాపత్రయ పడుతూనే ఉంది. 


మంచి విషయాలను చేస్తూ రికార్డు క్రియేట్ చేస్తే మంచిదే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లా’ కానీ ఎన్నికల సంఘాన్ని వ్యతిరేకించడంలో ఫస్ట్, సిబిఐని ప్రభుత్వ పరంగా బాన్ చేయడంలో ఫస్ట్, ఆదాయపన్ను దాడులకు పోలీసులను ఇవ్వక పోవడంలో ఫస్ట్ అంటూ వెనుక నుండి ఫస్ట్ రికార్డులు క్రియేట్ చేయడం ద్వారా ఎవ్వరికీ ఉపయోగముండదు పైగా యధారాజా.. తధాఃప్రజ అన్నట్లు నియంతృత్వ విధానలకు దారితీసే ప్రమాదం వాటిల్లే పరిస్థితి నెలకొనొచ్చు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయడు గారు ఎన్నికల సంఘం వైఫల్యం చెందిందని డిక్లెర్ చేసి అవతల పడిశారు. ఓటర్లకు అసౌరక్యం కలిగినందుకు చింతిస్తున్నామన్నారు. అస్సలు ఇటువంటి మాటలు మరే ముఖ్యమంత్రి అయినా మాట్లాడిన సందర్బం ఉందా? మధ్యాహ్ననికే 50% పోలింగ్ పైగా దాటిన రాష్ట్రంలో ఎన్నికల సంఘం తప్పులు ఏముంటాయి?


బారులుతీరి నిలుచున్న ఓటర్లుకు మళ్లీ - మళ్లీ టివి తెరపై ముఖ్యమంత్రి హోదాలో కనిపిస్తూ చంద్రబాబు గారు చేసే వినమ్ర విజ్ఞప్తులు ఎందుకు?  ఈయనగారి పబ్లిసిటీ వ్యామోహం ఇలా అయిన ఆఖరు పోలింగ్ నాడు కూడా పబ్లిసిటి చేసుకోవలన్న దుర్భుద్ది కాకపోతే అంటూ చెవులు కొరుక్కుంటున్నారు ఆంధ్రప్రజ.



మరింత సమాచారం తెలుసుకోండి: