ఆట ఆడుతున్నపుడు, గెలిచేవారు ఆటను ఆస్వాదిస్తూ..తమ అభిమానులను రంజింపచేస్తు మరిన్ని కేరింతలను వారి నుంచి అందుకుంటూ బ్రంహాండంగా ఆడుతూ ఉంటే..ఓడిపోయే వారు తమ ఉక్రోషాన్ని అణచుకోలేక అభాసుపాలవుతుంటారు.  మన ఇంట్లో చిన్న పిల్లల దగ్గర్నుండి..అంతర్జాతీయస్థాయి ఆటల వరకు జరిగేదిదే..


దురదృష్టవశాత్తూ...కోట్ల మంది ప్రజల జీవితములను ప్రభావితం చేస్తూ..వారి జీవితాకు ఆలంబనగా ప్రభుత్వాలు ఏర్పడిచే ఎన్నికలు కూడా రాజకీయ నాయకుల దృష్టిలోనే కాదు, సామాన్య ప్రజల దృష్ఠిలో ఆటలా మారిపోయిన రోజులివి.


ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండే తగిన వ్యవధి ఇవ్వలేదని ఎన్నికల సంఘంపై చిర్రుబుర్రులాడిన నాయుడు గారు  నానాటికి అన్నట్లు మోదీ,కేసీఆర్,జగన్, వైసీపీ పై సైద్దాంతికంగా కాకుండా వ్యక్తిగతంగా పోరాడున్నాను, నేను అన్న స్థాయిలో జరిపిన ప్రచారం తెదేపాకు కొండంత చేటు చేసిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.


ప్రజా జీవితంలో చాలా జాగ్రత్తలు తీసుకునే చంద్రబాబు ఎన్నికల ప్రచారం ముగిసిన గత రెండు రోజులుగా ప్రవర్తించిన , ప్రవర్తిస్తున్న విధానం బాబు దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, పెద్ద మనిషి అని పొగిడి నెత్తిన పెట్టుకున్న వారిచే కూడా ఏంటీ బాబుగారు ఇలా చేస్తున్నారు అని అన్పించిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


మొన్నటికి మొన్న ఎన్నికల కమిషన్ పై కోపంతో ఊగిపోతూ..ఎన్నికల కమిషనర్ కే వాళ్ల ఎన్నికల కమిషన్ గురించి కంప్లైంట్ చేయడాన్ని చూసి ఆంధ్రప్రజలే కాదు, దేశ వ్యాప్త రాజనీతిజ్ఞులు ముక్కున వేలేసుకున్నారాంటున్నారు. అసలీయనేనా మాకు తెలిసిన చంద్రబాబంటూ..ఈ రోజు ఎన్నికలయితే..తెల్లారి లెగిసిన దగ్గర్నుండి బాబు ఖండించారు, బాబు అగ్రహం వ్యక్తం చేశారు, బాబు లేఖ విడుద చేశారు. బాబు రాప్తాడు ఘటనను తీవ్రంగా ఖండించారు, తాడిపత్రి ఘటన మీద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు, నరసరావు పేట ఘటనపై తీవ్రంగా స్పందించారంటూ ఒకటే బ్రెకింగ్లు, తేదేపా అనుకూల ఛానెళ్ళలో మొత్తం బాబు గురించే.


రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలనే స్పృహ లేకుండా బాబు..అది..బాబు ఇది..బాబు ఇంకోటి అన్నట్లు సాగిన ఈ ఎపిసోడ్ ఎన్నికల అంకంలో ఒక ఎపిసోడయితే మాత్రం ఇంతకంటే ఘోరం మరొకటుండదంటున్నారు ప్రజాస్వౌమ్య వాదులు.
అయితే ఈ పనులన్నీ.. చూస్తున్న ఆంధ్రప్రజకు మాత్రం బాబుగారి మీద ఉన్న గౌరవం కూడా పోయిందన్నారు విశ్లేషకులు. ఒక ప్రక ఇది ఇలా ఉంటే బాబు కోడుకు వయస్సుండే జగన్ మాత్రం స్థితప్రజ్ఞుడిలా ఇన్నాళ్ళు బాబుగారి గురించి జనాలు అనుకున్న మాటల రూపంలో ఉండటం..ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు అనుమానం..బాబు కోపం తెదేపా శాపం అయ్యిందా అని. 


మరింత సమాచారం తెలుసుకోండి: