ఉత్తరాంధ్ర టీడీపీకి పెట్టని కోట. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలు ఈ మూడు జిల్లాలే. ఇక్కడ మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గతసారి ఇందులో మిత్ర పక్షం బీజేపీతో కలుపుకుని టీడీపీ 25 సీట్లు గెలుచుకుంటే వైసీపీ 9 సీట్లలో విజయం సాధించింది.

 


ఈసారి ఉత్తరాంధ్రలో సైకిల్ కి పంక్చర్లు పడుతాయన్న ప్రచారం సాగుతోంది. నిన్న జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే వైసీపీకి తక్కువల్లో తక్కువ 20 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళంలో ఆరు, విజయనగరంలో ఆరు, విశాఖలో ఎనిమిది సీట్లు వైసెపీఎకి వాస్తాయని చెబుతున్నారు. ఈ లెక్కన పద్నాలుగు సీట్లతో టీడీపీ సర్దుకుపోవాల్సిందేనని అంటున్నారు. అదే జరిగితే అధికారానికి టీడీపీ దూరమవుతుందన్న ఆందోళన తమ్ముళ్లలో కలుగుతూంది.

 


ఈ మూడు జిల్లాల్లో చూసుకున్నపుడు గతం కంటే వైసీపీ పట్టు బాగా సాధించింది. సరైన అభ్యర్ధులను ఎంపిక చేసుకోవడం, కుల సమీకరణలు చూసి మరీ రంగంలోకి దిగడం కలసి వచ్చాయని అంటున్నారు. అలాగే వైసీపీ నేతలు కసిగా పనిచేయడం కనిపించింది. ఇక బీసీలు ఈసారి చీలి ఓ వర్గం వైసీపీ కి సపోర్ట్ చేయడం కూడా ఫ్యాన్ జోరుకు కారణంగా చెబుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: