తెలుగుదేశంపార్టీ జనాలు బతుకుతున్నదే మీడియాపైన. టిడిపి నేతలకు మీడియా ప్రచారం  లేకపోతే అసలు ఊపిరే ఆగిపోయినట్లుంటుంది. అలాంటిది గురువారం పోలింగ్ సందర్భంగా చంద్రబాబునాయుడు తప్ప మిగిలిన నేతలు పెద్దగా కనబడనే లేదు. పోలింగ్ లో బిజీగా ఉన్నారని అనుకుంటే ముగిసిన తర్వాత కూడా ఎక్కడా కనబడలేదు.

 

చంద్రబాబు మాత్రమే ఉదయం నుండి సాయంత్రం వరకూ రెండు మూడు సార్లు మీడియా ముందుకొచ్చారు. రాత్రి మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఓ కేంద్రం ముందు ధర్నా అంటూ నారా  లోకేష్ కాస్త హడావుడి చేశారు. మామూలుగా అయితే పోలింగ్ లో జరిగిన గొడవలకు టిడిపి నేతలు వైసిపి పై రెచ్చిపోవాలి.

 

పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల వైసిపి నేతలపైన టిడిపి నేతలే దాడులు చేశారు. ఇద్దరు ఎంఎల్ఏలు పాముల పుష్పవాణి, గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డిపైనే దాడి చేశారు. ఎంఎల్ఏలతో పాటు అభ్యర్ధులపైన కూడా దాడులు జరిగాయి.  ఇంత చేసినా చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియాలో మాత్రమే వైసిపికి వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. మీడియాలో వైసిపి వ్యతిరేకంగా వచ్చాయే కానీ టిడిపి నేతలు మాత్రం మీడియా ముందుకు రాలేదు.

 

ఒకవైపు చంద్రబాబు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడుతున్నా టిడిపి నేతలు మాత్రం మీడియా ముందుకు రాలేదు. కారణాలేంటో తెలియటం లేదు. బహుశా వైసిపికి వ్యతిరేకంగా ఎంత మాట్లాడినా ఉపయోగం లేదనుకున్నారో ఏమో ? లేకపోతే టిడిపి ఎత్తిపోతోందన్న అనుమానం వచ్చిందేమో కూడా. అందుకే పోలింగ్ జరిగిన తీరుపై ఎక్కడా టిడిపి నేతలు నోరు ఎత్తలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: