ఎన్నికల్లో ఓటమి చంద్రబాబుకు ముందే అర్ధమయినట్టుంది. అందుకే మీడియా ముందు ఏం మాట్లాడాలో తెలియక దిగజారి పోయి మాట్లాడుతున్నాడు. జగన్ అంటే ఆయనకు ఏపాటి భయముందో మీడియా ముందే బైటపెట్టుకుంటున్నారు.అసలు జగన్ ఎవరు? ఆయనేం సాధించారు? ఆయనకు మీరెందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఆయన మాటలకు నేనెందుకు బదులు చెప్పాలంటూ జర్నలిస్ట్ లపై ఆగ్రహం వ్యక్తంచేశారు.


ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. బాబు కనీస ఇంగితం కూడా మర్చిపోయారు. మోడీని చూస్తే ఉచ్చపోసుకుంటారు, కేసీఆర్ ని చూస్తే మీకు భయం.. తెలియకుండానే ప్యాంటు తడిసిపోతుంది అంటూ జగన్ ని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు, అందులోనూ మహిళా జర్నలిస్టుల ముందు, వారు అడిగిన ప్రశ్నకు బాబు ఇలా సమాధానం చెప్పడం, వెకిలిగా నవ్వడం ఆయనలోని అభద్రతా భావాన్ని బైటపెట్టడమే కాకుండా, ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా మారింది.


జగన్ గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై కూడా మండిపడ్డారు బాబు. యూజ్ లెస్ ఫెలోస్ గురించి నన్ను ప్రశ్నిస్తారా? నేను సమాధానం చెప్పాలా? అసలు మీరు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టుకోండి, లేకపోతే అమెరికాలో పెట్టుకోండి అంటూ నిప్పులు తొక్కిన కోతిలా అంతెత్తున ఎగిరారు. మీడియా సమావేశం పెడితే జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక ఉండాలి,

మరింత సమాచారం తెలుసుకోండి: