అదేంటో చంద్రబాబు తీరు మరీ విడ్డూరం. పోలింగుకు ముందు గొంతు చించుకున్నారు. పోలింగ్ తరువాత కూడా ఆయన అదే తీరున విరుచుకుపడుతున్నారు. పోలింగ్ రేపు అనగా ఈసీ ఆఫీస్ ముంది ధర్నా చేసిన ఘనత బాబుదే. పోలింగ్ రోజున గంటల వ్యవధిలోనే రీపోలింగ్ పెట్టమని డిమాండ్ చేసిన నేత కూడా అయనే. ఇపుడు పోలింగ్ అయిపోయి భారీ ఎత్తున ఓటింగ్ జరిగిన మీదట కూడా బాబు పెద్ద గొంతు చేస్తున్నారు.


ఈ రోజు చంద్రబాబు డిల్లీ వెళ్ళారు. పదిహేను మంది నాయకులను వెంట తీసుకుని మరీ ఆయన సీఈసీని కలిశారు. ఏపీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, సరిగా ఎన్నికలు జరిపించలేదని ఆయన ఓ సుదీర్ఘమైన లేఖను అందచేశారు. ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన బాబు మొత్తం తప్పంతా ఈవీఎంలదేనంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాధమిక హక్కులను కాపాడడంలో ఈసీ పూర్తిగా విఫలం అయిందని బాబు అనడం విశేషం. ఈవీఎంలపై తాము చాలా కాలంగా పోరాడుతున్నామని అవి వద్దని బాబు అన్నారు. 


వాటి వల్ల తప్పులు జరుగుతాయని. అసలైన ప్రజాభిప్రాయం రాదని బాబు పేర్కొన్నారు. ఏపీలో ఈసీ అధికార దుర్వినియోగం చేసిందని బాబు ఆరోపించారు. నా ఓటే ఎవరికి పడిందో తెలియదంటే సామన్యుడి పరిస్థితి ఏంటని బాబు అమాయకంగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ డైరెక్షన్లో ఈసీ పనిచేస్తోందని ఓ బండ పడేశారు. మొత్తానికి బాబు డిల్లీ టూర్లో సాధించింది ఏంటయ్యా అంటే ఏపీలో చెప్పిన మాటలనే అక్కడా అప్పచెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తూంటే బాబులో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: