ఎన్నికలు అయిపోయిన కూడా ఇంకా చంద్రబాబు చేస్తున్న కామెడీలు, హడావిడి మాములుగా లేదు. అసలు ఇంత హడావుడి దేనికని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పోలింగ్‌ జరిగిపోయింది.. గెలుపోటములపై ఓ రాజకీయ పార్టీగా ధీమా వ్యక్తంచేస్తూ మీడియా ముందుకొచ్చిన వైఎస్‌ జగన్‌, హుందాగానే వ్యవహరించారు. మామూలుగా అయితే జరిగిన పరిణామాలపై వైఎస్సార్సీపీ ఎంతో కొంత ఆందోళన వ్యక్తంచేయాలి. అంతలా ఈవీఎంలు మొరాయించాయి మరి.


అయినాసరే, మొరాయించిన ఈవీఎంలు సరిదిద్దాక ఓటింగ్‌ భారీగా నమోదయ్యింది. దాంతో, ఈవీఎంల విషయమై వైఎస్సార్సీపీకి పెద్దగా అభ్యంతరాల్లేవు. పోలింగ్‌ జరిగాక ఏ రాజకీయ పార్టీ అయినా హుందాతనం మెయిన్‌టెయిన్‌ చేయాలి. ఎందుకంటే, ఫలితం ఏంటన్నది ఆల్రెడీ అక్కడ నిక్షిప్తమైపోయింది గనుక. ఆ ఫలితం వచ్చేలోపు గగ్గోలు పెట్టడం వల్ల ప్రయోజనం వుండదు. నలభయ్యేళ్ళ అనుభవం వున్న చంద్రబాబు, సంయమనాన్ని కోల్పోతే.. నలభయ్యేళ్ళ వయసు మాత్రమే వున్న వైఎస్‌ జగన్‌ మెచ్యూరిటీ ప్రదర్శించారు. 'ఇది వైఎస్‌ జగన్‌ గెలుపుకి సంకేతం' అని రాజకీయ విశ్లేషకులు ముక్త కంఠంతో చెబుతున్నారిప్పుడు.


ఇంకా దాదాపు నలభైరోజుల సమయం వుంది ఫలితాల వెల్లడికి.. ఈలోగా చంద్రబాబు ఎన్ని పిల్లిమొగ్గలైనా వేయొచ్చు.. వైఎస్‌ జగన్‌తోపాటు వైఎస్సార్సీపీ నేతలంతా చంద్రబాబు చేయబోయే కామెడీని చూసి ఎంజాయ్‌ చేస్తారన్నది నిర్వివాదాంశం. ఫలితాలొచ్చాక గెలుపెవరిదన్నది తేలుతుంది.. నిబద్ధత, విశ్వసనీయత, హుందాతనంలో మాత్రం వైఎస్‌ జగన్‌ ముందే గెలిచేశారు చంద్రబాబుపైన.

మరింత సమాచారం తెలుసుకోండి: