ఏపీలో ప్రస్తుతం ఉన్నది ఆపధ్ధర్మ పాలన. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మొదటి విడతలోనే ఎన్నికలు జరిగిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా నలభయి రోజు ల గడువు ఉంది. మరో వైపు ఆపధ్ధర్మ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు నిమిత్తమాత్రులే. విధానపరమైన నిర్ణయాలు ఎటూ  తీసుకోవడానికి వీలులేదు.

 

కొత్తగా ఏర్పడిన సర్కార్ కే అధికారాలు పూర్తిగా ఉంటాయి. ఈ సమయంలో ఏపీలో పాలన ఉందా,, ఉంటే ఎలా నడుస్తోంది అన్నది కేంద్రం వేయి కళ్ళతో నిఘా పెట్టి ఉంచుతోంది. ఇక ఏపీలో ముఖ్య మంత్రి చంద్రబాబు గత కొన్ని రోజులుగా చేస్తున్న చర్యలను కూడా కేంద్రం గమనిస్తోందని అంటున్నారు.  ఏపీలో ఈసీ ఎదుట బాబు ధర్నా చేయడం. ఏకంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన  ప్రధాన ఎన్నికల అధికారిని బెదిరించే విధంగా మాట్లాడడం వంటివన్నీ కూడా కేంద్ర పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు.

 

మరో వైపు ఏకంగా ఈసీ నిర్ణయాలనే తప్పుపడుతూ దారుణమైన భాషను ఉపయోగిస్తున్న చంద్రబాబు ఆ దూకుడులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర్ట్ అనేశారు. ఆయన మీద కేసులు ఉన్నాయంటూ మాట్లాడారు. ఇక ప్రతీ రోజూ యాగీ చేయడం, రాజకీయం కోసమే అన్నట్లుగా ప్రశాంత రాష్ట్రంలో టీడీపీ అధినాయకత్వం వ్యవహరించడం ఎప్పటికపుడు కేంద్రం మానిటరింగ్ చేస్తోందని అంటున్నారు.

 

ఇక చావో రేవో అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బాబు సర్కార్ ఏమైనా చేస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడం, ఏకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం వంటివి కూడా  కేంద్రం పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఈవీఎంల భద్రతను పెంచాలని, కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని కూదా విజయసాయిరెడ్డి కోరుతున్నారు. మరి ఈ పరిణామాల నేపధ్యంలో బాబు ఇప్పటికైనా దూకుడు తగ్గించి జాగ్రత్తగా ఉంటారా లేదా అన్నది కేంద్రం నిశిత పరిశీలన చేస్తోందని అంటున్నారు.

 

 ఒక వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం తక్షణం రాష్ట్రపతి పాలన పెట్టేందుకు కూడా కేంద్రం వెనకాడని అంటున్నారు. ఎటూ ఎన్నికలు ముగిసినందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ రాష్ట్రపతి పాలన బెటర్ అన్న దిశగా కేంద్రం ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. ఒకవేళ అలాంటిది జరిగితే మాత్రం బాబు కోరి తెచ్చుకున్నట్లేనని అంతా భావించడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: