అమరావతిలో ఎన్నికల కమీషనర్ పై కారాలు మిరియాలు రువ్వారు. నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేశారు. అంతకుముందు మీడియా సమావేశాల్లో కూడా చాలానే మాట్లాడారు. చంద్రబాబు ఏమి మాట్లాడినా నోరుమూసుకుని రాసుకోవటం తప్ప నిలదీసి ప్రశ్నించే దమ్ము తెలుగు  మీడియాకు ఎప్పుడో పోయింది.  

 

సీన్ కట్ చేస్తే ఎన్నికల కమీషన్ పై ఫిర్యాదు చేసేందుకు పెద్ద బృందాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబుకు అక్కడ మాత్రం నోరు పడిపోయిందట. ఎన్నికల కమీషన్ పై ఫిర్యాదు చేస్తే చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎందుకు ఊరుకుంటారు ? సీఈసీ అరోరా ఏమైనా తెలుగు మీడియా జర్నలిస్టా ? చంద్రబాబు చెప్పింది విని తలాండించటానికి ? చంద్రబాబు లేవనెత్తిన ఐదు అంశాలకు ఘాటుగా సమాధానం ఇచ్చారట.

 

సీఈసీ అరోరాతో భేటీలో ఐదు అశాలను చంద్రబాబు ప్రస్తావించారు. మొదటిది ఈవిఎంలు సరిగా పనిచేయని కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడ్డారట. కాబట్టి 618 పోలింగ్ కేంద్రాల్లో అడ్జర్న్ పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఆ అంశంపై అరోరా మాట్లాడుతూ 46,500 పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బంది వచ్చింది కేవలం 256 పోలింగ్ కేంద్రాల్లోనే అన్నారు. అంటే 0.3 శాతం కేంద్రాల్లో మాత్రమే. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే మొన్నటి పోలింగ్ లో 24 లక్షల మంది అదనంగా ఓట్లు వేశారని చెప్పటంతో చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు.

 

రెండో అంశం అధికారుల బదిలీలు. దీనిపై అరోరా రిప్లై ఇస్తు ఎన్నికల విధుల్లో పొరపాట్లు చేసిన కారణంగానే ముగ్గురు ఎస్పీలు, సిఎస్, ఇంటెలిజెన్స్ ఐజిలను మాత్రమే బదిలీలు చేసినట్లు స్పష్టంగా చెప్పారు. మిగిలిన అధికారులను చంద్రబాబే బదిలీ చేసినట్లు చెప్పారట. ఏపికి ప్రత్యేకంగా పరిశీలకులను ఎందుకు పంపారంటూ చంద్రబాబు అడిగిన ప్రశ్నకు కూడా సీఈసి సమాధానం చెప్పారట. మిగిలిన రాష్ట్రాలకు పంపినట్లే ఏపికి కూడా పరిశీలకులను పంపినట్లు చెప్పటంతో సిఎం ఏమీ మాట్లాడలేకపోయారట.

 

వివి ప్యాట్ పేపర్ తొందరగా పాడైపోతుందని, అక్షరాలు కనిపించక ప్రూఫ్ లేకుండా పోతుందన్నారు. దానికి అరోరా బదులిస్తు వివి ప్యాట్ పేపర్ కు ఐదేళ్ళ లైఫ్ ఉంటుందని చెప్పారట. రుజువు కావాలంటే పోయిన ఎన్నికల్లో వాడిన వివిప్యాట్ పేపర్ ను చూపిస్తామని చెప్పగా చంద్రబాబు నోరెత్తలేదు. 50 శాతం వివి ప్యాట్స్ లెక్కించాలన్న వాదనకు కోర్టు ఆదేశాలను అనుగుణంగా నడుచుకుంటామని అరోరా బదులిచ్చారట. ఇక్కడ గమినించాల్సిన విషయం ఏమిటంటే, అమరావతిలో ఎన్నికల కమీషనర్ దగ్గర నోరుపారేసుకున్న చంద్రబాబు ఢిల్లీలో సీఈసీ దగ్గర మాత్రం నోరెత్తకుండా బయటకు వచ్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: