ఏపీ రాజకీయం ఇపుడు జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. ఇక్కడ ఎవరు విజేత అన్నది కూడా జాతీయ నేతలు ఓ అంచనా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయలంటెనే నంబర్ గేం. గెలుపు గుర్రాలతోనే ఎవరైన పందెం కడతారు. అందువల్ల ఏపీలో వచ్చే ఫలితాలు రేపటి రోజున జాతీయ రాజకీయల‌ను సైతం విపరీతంగా ప్రభావితం చేయనున్నాయి.


ఏపీలో చంద్రబాబు హవా ఉంటుందని ఇపుడెవరూ భావించడం లేదు. నిజానికి ప్రచార పర్వంలోనే కాశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా వంటి వారు ఏపీలో గాలిని గమనించారు.  మమతా బెనర్జీ అయితే జగన్ని ఒక్క మాట అనలేదు. కేజ్రీవాల్ మోడీనే టార్గెట్ చేసి వెళ్ళిపోయారు. ఇక విజయవాడ వచ్చిన దేవెగౌడ సైతం బాబుని కీర్తించారు తప్ప ప్రత్యర్ధి జగన్ని పెద్దగా ఏమీ అనలేదు.  ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలే. 


ఈ పరిణామాలను గమనిస్తే రేపటి రోజున ఏపీలో అధికారం నిలబెట్టుకోలేరని  బాబు విషయంలో జాతీయ నేతలు ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దానికి ఉదాహరణగా ఢిల్లీలో బాబు మీడియా సమావేశాలు చప్పగా సాగడం, గతంలో వచ్చిన స్పందన లేకపోవడం, నాయకులు సైతం అంతగా కలుపుగోలుగా లేకపోవడం వంటివి చూస్తూంటే  ఏపీ ఎంతలా షాక్ ఇవ్వబోతోందో అర్ధమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: