ఏపీలో తొలి విడతలో ఎన్నికలు అయిపోవడం కాదు కానీ ఇపుడు అంతా ఎడ తెగని టెన్షన్లో గడపాల్సివస్తోంది. గెలుపు గుర్రాలు ఎవరివి అన్నది ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్న అర్ధం కాని పరిస్థితి. కొంత వరకూ విషయం బయటపడుతున్నా అదే జరగాలని లేదు కదా అన్న వితండ వాదనలు హై బీపీని తెప్పిస్తున్నాయి.


ఇక విషయానికి వస్తే ఏపీలో జగన్ అధికారానికి చేరువలో ఉన్నాడని అన్ని రకాల సర్వేలు చెప్పాయి. ఇప్పటికీ చెబుతున్నాయి. దీనికి అనేక కారణాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇక జగన్ విషయంలో కొన్ని అనుకూల అంశాలు ఆయన గెలుపును సులువు చేస్తున్నాయి. అవేంటంటే గత ఎన్నికల్లొ  జగన్ 67 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నారు. అధికారంలోకి రావడానికి మ్యాజిక్ నంబర్ 88 అయితే 21 సీట్లతో జగన్ వెనకబడ్డారు. ఇపుడు ఆ 21 సీట్లు తెచ్చుకుంటే చాలు జగన్ సీఎం అయిపోయినట్లే.


దానికి జగన్ కి దగ్గర దారులు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. జగన్ వరకూ వైసీపీ రాయలసీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పట్టును బాగానే నిలబెట్టుకుంది. ఇక కోస్తా ఉత్తరాంధ కలుపుకుని 104 సీట్లు ఉన్నాయి. ఇక్కడ గత ఎన్నికల్లో జగన్ పార్టీకి వచ్చినవి అచ్చంగా 24 సీట్లు మాత్రమే. ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపీకి గోదావరి, ఉత్తరాంధ్ర దెబ్బ వేయడం ఖాయమని అంటున్నారు. పవన్ ఫ్యాక్టర్ వల్ల టీడీపీకే నష్టమని తేలుతున్న వేళ గత 24 సీట్లకు మరో 24 సీట్లు జగన్ జత చేసుకుంటే చాలు ఏపీకి ఆయనే కాబోయే సీం అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: