కింద  పడ్డా మీదనే చేయి అన్నవాడే ఫక్త్  పొలిటీషియన్. ఈ విషయంలో చంద్రబాబు ఏం తక్కువ తినలేదు. అసలు ఆయన ఓడిందెపుడు, ఓడిపోయానని చెప్పిందెపుడు. 2004 ఎన్నికల్లో ఈవీఎంల వల్ల ఓడానని అన్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి వల్ల అధికారం పోయిందన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోతే కారణాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు.


ఇక ఏపీలో ఓటమి ఖాయమని బాబుకు తెలిసిపోయిందని సెటైర్లు కూడా పడుతున్నాయి. ఆయన తిట్ల పురాణం, కట్టలు తెగిన అసహనం, మారిన బాడీ లాంగ్వేజ్ ఆ సంగతిని చెప్పకనే చెబుతున్నాయి. అయితే బాబు అలాంటి ఇలాంటి నాయకుడు కాదు, ఆయన జాతీయ నేత. అందువల్ల గత కొన్ని రోజులుగా డిల్లీలో మకాం వేశారు. ఇపుడు ఉత్తరాది రాష్ట్రాలో ప్రచారం అంటున్నారు. అనుకూల మీడియాలో ఆ న్యూస్ బాగానే రాయించుకుంటున్నారు.


బాబు దేశంలో అన్ని రాష్ట్రాల్లో తిరిగి మోడీని గద్దె దింపుతారట. ఏపీలో మాకు అన్యాయం చేశారు. మీకు కూడా చేస్తారు కాబట్టి ఓటు వేయవద్దు అని చెబుతారట. అయినా అయిదేళ్ళ క్రితం వరకూ కలసి ఉన్న తెలంగాణాలో మొన్న జరిగిన  ఎన్నికలలో బాబు ప్రచారం చేస్తేనే కాంగ్రెస్ కూటమికి ఓట్లు పడలేదు. ఇంక హిందీ బెల్ట్లో బాబు గారి స్పీచ్ వినేదెవరు, ఓట్లు రాల్చేదెవరని అపుడే కౌంటర్లు పడుతున్నాయి. 
అయితే ఇక్కడే బాబు తన మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని అంటున్నారు.
తాను జాతీయ నేతగా ప్రొజెక్ట్ అయితే రేపటి రోజున కేంద్రంలో మోడీకి యాంటీగా కేంద్రంలో సర్కార్ ఏర్పడితే అక్కడ పాగా వేయాలని బాబు గారి ఆలోచనగా ప్రచారం సాగుతోంది. అయినా కేంద్రంలో  బీజేపీయేతర సర్కార్ ఏర్పడితే ఏపీ నుంచి జగన్ ఎంపీలను సాయం అడగకుండా ఉంటారా. ఈ లాజిక్ ని బాబు ఎలా మిస్ అవుతున్నారన్నదే డౌట్ అంటున్నారు.
    


మరింత సమాచారం తెలుసుకోండి: