ఏపీలో ఎన్నికలు ముగిసినా ఇంకా ఆ వేడి అలాగే ఉంది. ఇది మరో నలభై రోజుల వరకూ కొనసాగనుంది. చిత్రమేంటంటే పోలింగ్ తరువాత కూడా అదే టెంపో కొనసాగుతోంది. మంచి ఎండల్లో ఏపీ జనాలకు కూల్ కూల్ గా ఉందిపుడు. ఎన్నికలు అయిపోయాయని ఆనందించేవారికి, చింతించే వారికి కూడా ఇపుడు ఇది బాగానే ఉంది.


ఈసారి ఎన్నికల్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉచితంగా దొరికింది. కడుపుబ్బ నవ్వుకునే ఘటనలు ఎన్నో జరిగాయి. నాలుగు నెలల క్రితం జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో లేని వినోదం ఒక్క ఏపీకే సొంతం. ఇక్కడ మరి అలాంటివి అన్నీ ముందు నుంచి ఓపికగా భరించేందుకు జనం రెడీగా ఉన్నారు. అందువల్లనే కొండను నేనే మోస్తున్నట్లు ఫోజు కొడతాడో నాయకుడు. ఓటేసినంతనే తెగ ఆనందంపడిపోతాడు మరో నాయకుడు. అసలు నామినేషన్ వేస్తేనే అంత హుషార్ వస్తుందా అనిపించే తీరు కూడా ఇక్కడే చూశారు జనం.


ఇక చిన్న గుమస్తా జాబ్ కి కూడా ఎన్నో పరీక్షలు, ఎంతో తతంగం, కష్టం ఉన్న ఈ రోజుల్లో ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎంటర్టైన్మెంట్ సీఎం పోస్ట్ నేనే కాబోయే సీం ఇలా పలవరించారుగా  చాలా మంది నేతలు. హామీలు చూసినా కూడా  ఈసారి చాలా కామెడీ పండించాయి. ఒకాయన తన నియోజకవర్గంలో మొత్తం జనాభాకు జాబ్ గ్యారంటీ అనేశారు. అదీ ప్రభుత్వ ఉద్యోగం. వారూ వీరు కాదు ఎంతో మంది చాలా కష్టపడి అందించిన వినోదం అంతా ఇంతా కాదు. ఇంకా ఆ కామెడీ కంటిన్యూ అవడమే ఏపీ జనం చేసుకున్న  మహా భ్యాగ్యం. ఇది  మే 23 వరకూ సాగుతుందో. ఆ తరువాత కూడా కొనసాగుతుందో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: