వైసీపీ అధినేత జగన్ గత రెండేళ్ళుగా జనానికి ఎంత దగ్గరయ్యాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పాదయాత్ర ఏకంగా రికార్డ్ స్థాయిలో సాగింది. మొత్తం 14 నెలల పాటు జగన్ జనంలో ఉన్నారు. ఆ తరువాత ఎన్నికలు ఈ విధంగా ఏపీని మొత్తం కలియ చుట్టేశారు. ఏపీలో జగన్ ఫ్యాక్టర్ అన్నది  క్రియేట్ చేశారు.


ఇక ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఆ రోజు ఉదయం పులివెందులలో ఓటు వేసిన జగన్ కొద్ది సేపు విలేకరులతో మాట్లాడారు. ఆ తరువాత రాత్రి పోలింగ్ సరళి గురించి లోటస్ పాండ్ నుంచి మీడియా మీట్ నిర్వహించారు. ఇక అంతే జగన్ గత నాలుగు రోజులుగా సందడి చేయడమేలేదు. ఎన్నికల ఫలితాలు రావడానికి గట్టిగా నలభై రోజులు వ్యవది ఉంది. మరి జగన్ ఇన్ని రోజులుగా పడిన శ్రమ అంతా మరచిపోతూ కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతున్నారని అంటున్నారు.


అందువల్ల జగన్ ఇప్పట్లో మీడియా ముందుకు రావడం చాలా అరుదు. ఇక జనంలోకి రావడం అన్నది కూడా ఇప్పట్లో కుదిరే వ్యవహారం. కాదు. మే 23న వైసీపీ గెలిచి తీరుతుందని అంచనాలు బలంగా ఉన్నాయి. అదే కనుక జరిగితే జగన్ అను నేను అన్న గొంతును మాత్రం ప్రజలు వినే అవకాశం ఉంటుంది. ఆ తరువాత సీఎం అయితే జగన్ అధికారిక హోదాలో జనానికి కొంత దూరం పాటించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జనంలో జగన్ ఉన్న ఈ కాలమంతా గొప్పదిగానే భావించాలేమో. ఇంత విగరస్ గా జగన్ మళ్ళీ తిరగడం, ప్రసంగాలు చేయడం  అన్నది  ఇప్పట్లో ఉండకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: