ఏపీలో వైఎస్ జ‌గ‌న్ అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ఇటు రాజ‌కీయ విశ్లేష‌కులు స‌హా వివిధ స‌ర్వే సంస్థ‌లు, ప్ర‌జ‌లు భావిస్తున్న త‌రుణంలో...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మైన త‌రుణంలో...నేత‌ల‌కు ఎవ‌రికి ఎలాంటి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. ఇందులో భాగంగా రోజా పేరు చ‌ర్చ‌ల్లో నానుతోంది. ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డ‌మే కాదు...హోంమంత్రి ప‌ద‌వి కూడా ఖాయ‌మ‌ని అంటున్నారు.


వైఎస్ జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం అయినప్పుడు తన కేబినెట్‌లో పార్టీ సీనియ‌ర్ నేత‌ సబితా ఇంద్రారెడ్డికి హోమ్ మంత్రి పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెకి హోమ్ మంత్రి పదవిని ఇచ్చినందుకు రాజశేఖర్ రెడ్డి ప‌ట్ల మహిళలు ఎంతో ఆద‌ర‌ణ క‌న‌బ‌ర్చారు. అదే స‌మీక‌ర‌ణంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి తనయుడు చేస్తార‌ని అంటున్నారు. జగన్ గెలవడం ఖాయ‌మ‌వ‌డం, సీఎం పీఠం అదిరోహించ‌డం లాంచ‌న‌ప్రాయమ‌ని భావిస్తూ ఆయన కేబినెట్‌లో రోజాకి మంత్రి పదవి ఇవ్వబోతున్నార‌ని అంటున్నారు. 


రోజా బ‌రిలో దిగిన నగరిలో వార్ వన్ సైడ్‌ అని పేర్కొంటున్న విశ్లేష‌కులు వైసీపీ కేబినెట్ లో మంత్రి పదవి రోజాకు ద‌క్క‌డం కూడా ఖాయ‌మంటున్నారు. ప్ర‌జలు ఎవరి పక్షానా ఉండబోతున్నారో ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారో తేలేందుకు మ‌రో నెల‌రోజుల‌కు పైగా స‌మ‌యం ఉండ‌టం ఓ వైపు...మంత్రి పదవి కేటాయింపుల‌కు మ‌రింత స‌మ‌యం ఇంకో వైపు ఉండ‌గా...ఈ త‌ర‌హా చ‌ర్చ‌లు తెర‌మీద‌కు రావ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: