ఇపుడు దేశంలో ఈవీఎం లు వద్దనే పొలిటికల్ బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ వాదించేది ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి చేటు అని. వాటి వల్ల ఫలితం సరిగ్గా రాదని, ఎక్కడిక్కడ ట్యాంపరింగ్ చేయవచ్చునని. ఇలా పాపం ఆ మిషన్ మీద నేరాలూ ఘోరాలు చాలానే మోపేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఓటు ఏ రూపంలో ఉంటేనేంటి షాక్ కొట్టాలంటే కొట్టదా మరి.


ఇపుడు పేపర్ బ్యాలెట్ కావాలని కోరుతున్న వారిలో చంద్రబాబు ముందు వరసలో ఉన్నారు ఆయన గారికి పేపెర్ బ్యాలెట్ అయితే ముద్దు అంటున్నారు.బాగానే ఉంది కానీ ఇపుడు ఏపీలో కూడా పేపెర్ బ్యాలెట్ ఉంది. అదే పోస్టల్ బ్యాలెట్. ఇది బాబు గారు కోరుకున్న బ్యాలెట్టే మరి. కానీ ఇది  ఇపుడు షాక్ కొడుతోందిగా. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఈ నెల 5న మొదలైంది. మే 23 లోగా ఎపుడైనా ప్రభుత్వ ఉద్యోగులు ఓటు చేసుకోవచ్చు. మరి ఇంతలా సౌకర్యంగా ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఏపీలో రాజకీయం ఎలా ఉండబోతోందో తొలిసారిగా గుట్టు బయటపెట్టింది.


పోస్టల్ బ్యాలెట్లో టీడీపీకి షాక్ తగిలించే పరిణామాలే ఎక్కువగా ఉన్నాయంట. ఏపీలో అయిదేళ్ల తరువాత ప్రజా తీర్పు ఎలా ఉండబోతోదన్న చర్చ వచ్చిన తరువాత సర్వేలతో సంబంధం లేకుండా అచ్చమైన జనం గుండె చప్పుడుగా పోస్టల్ బ్యాలెట్ నిలిచిందని అంటున్నారు. దాంతోనే అధికార పార్టీకి గుండే దడ పట్టుకుందని కూడా సెటైర్లు పడుతున్నాయి.  పోస్టల్ బ్యాలెట్ కోరినా కూడా విశాఖలో అంగన్వాడీలకు, ఆశా  వర్కర్లకు, ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వడంలేదట. దీని మీద వైసీపీ ఏకంగా జిల్లా రిటర్నింగ్  అధికారిన్ ఇ కలసి వినతిపత్రం సమర్పించింది. ఇంతకీ విషయమెనటంటే పేపర్ బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా ఓటు ఓటే. షాక్ షాకే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: