Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 12:51 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : ఈ నియోజకవర్గాల్లో టిడిపికి జనసేన ఎసరు తప్పదా ?

ఎడిటోరియల్ : ఈ నియోజకవర్గాల్లో టిడిపికి జనసేన ఎసరు తప్పదా ?
ఎడిటోరియల్ : ఈ నియోజకవర్గాల్లో టిడిపికి జనసేన ఎసరు తప్పదా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారం ప్రకారం అదే జరగబోతోందట. చంద్రబాబునాయుడు ఏదో అనుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోపాయికారీగా ప్రోత్సహించారు. చంద్రబాబు ఉద్దేశ్యం పవన్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడమే. కానీ సీన్ రివర్సయి జనసేన వల్ల టిడిపికే దెబ్బ పడిందట. అందులోను ప్రధానంగా 12 పార్లమెంటు స్ధానాల్లో బాగా ఎక్కువగా తాకిందట దెబ్బ.

 

వివిధ పార్టీ నేతల సమాచారం ప్రకారం విశాఖపట్నం, అమాలపురం, రాజమండ్రి, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, హిందుపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నరసాపురం పార్లమెంటు స్ధానాల్లో టిడిపికి  కాపు దెబ్బ తప్పేట్లు లేదని సమాచారం. ఎందుకంటే పై స్ధానాల్లో ఎంపి అభ్యర్ధులుగా పవన్ గట్టి అభ్యర్ధులనే నిలబెట్టారు. వారంతా  వైసిపి ఓట్లను చీల్చుతారని ముందుగా అనుకున్నా ఓటింగ్ తర్వాత మాత్రం తమ అంచనాలు తారుమారైపోయినట్లు అర్ధమైపోయిందట.

 

పై నియోజకవర్గాల్లో అంటే విశాఖపట్నంలో జెడి లక్ష్మీనారాయణ, నరసాపురంలో సోదరుడు నాగుబాబు, నంద్యాలలో ఎస్పీవై రెడ్డి, రాజమండ్రిలో ఆకుల సత్యనారాయణ, హిందుపురంలో ఖాన్, చిత్తూరు నుండి పుణ్యమూర్తి, నెల్లూరు నుండి చండ్ర రాజగోపాల్ లాంటి గట్టి వారిని పోటీలోకి దింపారు.

 

నిజానికి పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే టిడిపి అభ్యర్ధులను గెలుపును త్యాగం చేయమని చంద్రబాబు చెప్పినా వాళ్ళు వినలేదట. అదే సందర్భంలో పై పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు గట్టిగా పోటీ ఇచ్చారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనసేన అభ్యర్ధులకు సొంతంగా గెలిచేంత సీన్ లేదని అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రత్యర్ధులైన టిడిపి, వైసిపిల అభ్యర్ధులను మాత్రం ఓడగొట్టడానికి పనికివస్తారు.

 

పై లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు కనీసం తలా లక్షో లేకపోతే లక్షన్నర ఓట్లో తెచ్చుకుంటే ఆ మందం టిడిపికే దెబ్బని ఇపుడు అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే, టిడిపి, జనసేనలు కలిసే పోటీ చేశాయి. అప్పుడు పవన్ ను చూసే కాపుల ఓట్లన్నీ టిడిపికి పడ్డాయి. ఇపుడు రెండు పార్టీలు విడిగా పోటీ చేశాయి కాబట్టి కాపుల ఓట్లలో మెజారిటీ ఓట్లు జనసేనకే పడతాయనటంలో సందేహం లేదు. కాబట్టి జనసేన దెబ్బ టిడిపి మీదే పడటం ఖాయమని అర్ధమవుతోంది.

 

 

 


chandrababu-tdp-pawan-kalyan-janasena-tight-fight-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ :  చంద్రబాబు వద్దనుకున్నదే జరుగుతోందా ?
ఎడిటోరియల్ : ఎగ్జిట్ పోల్ సర్వేలు నిజమైతే ఏపికి నష్టమేనా ?
ఎడిటోరియల్ : క్యాబినెట్ లో ప్రాధాన్యత దక్కేది వీరికేనా ?
చంద్రబాబుకు స్టాలిన్ షాక్
ఎడిటోరియల్ : చంద్రబాబు కష్టాలకు సెక్రటేరియట్ వాస్తు దోషాలే కారణమా ?
ఎడిటోరియల్ : లగడపాటి సర్వే బోగస్ అని తేలిపోయింది..ఇదే ఆధారం
ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఊహించని షాక్...గట్టి దెబ్బే కొట్టారా ?
ఎడిటోరియల్ : పసుపు కుంకుమే చంద్రబాబుకు షాకిచ్చిందా ?
ఎడిటోరియల్ : కేంద్రప్రభుత్వంలో వీళ్ళే కీలకమా ? జగన్ స్ధానమేంటి ?
ఎడిటోరియల్ :  జగన్ బాధ్యత కాంగ్రెస్ ఎవరికి అప్పగించిందో తెలుసా ?
ఎడిటోరియల్ : ఆ 17 నియోజకవర్గాలపైనే వైసిపి గురి
ఎడిటోరియల్ : చంద్రబాబు డేంజరస్ గేమ్...చివరకు ఏమవుతుందో ?
ఎడిటోరియల్ : అమరావతి షెల్టర్ జోన్ గా మారిపోయిందా ?
ఎడిటోరియల్ : కలెక్టర్ పై వేటుకు రంగం సిద్ధమైందా ?
ఎడిటోరియల్ : ఎంపి, ఎంఎల్ఏ సీట్లపై చంద్రబాబు లెక్కేంటో తెలుసా ?
సీఈసీ దగ్గర ఇంత అవమానం జరిగిందా ? తలదించుకున్న చంద్రబాబు !
బ్రేకింగ్ న్యూస్ : విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ
భోరుమన్న కేంద్ర మాజీ మంత్రి
ఎడిటోరియల్ : చంద్రబాబు ప్లాన్ అర్ధమవుతోందా ?
ఎడిటోరియల్ : అందుకేనా రీ పోలింగ్ ను వ్యతిరేకిస్తున్నది
ఎడిటోరియల్ : చంద్రబాబుకు కేంద్రంలో కీలక పదవి ?
ఎడిటోరియల్ : ఫలితాల తర్వాత పవన్ చేసే పని అదేనా ?
ఎడిటోరియల్ : కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది...అందరిలోను టెన్షన్
ఈసారి కూడా ఇక్కడ టిడిపికి చుక్కలు కనబడటం ఖాయమేనా ?
బయటపడిన చంద్రబాబు నైజం
వివేకా హత్యలో కిరాయి హంతకులు అక్కడి వాళ్ళేనా ?
ఎడిటోరియల్ :  బాలయ్య గెలుపు ఎవరిపై ఆధారపడుందో తెలుసా ?
23 ఫలితాలనైనా ఒప్పుకుంటారా  ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.