అవును వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. మామూలుగా అయితే టిడిపి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చితీరాలి. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గనుక అధికారంలోకి వస్తే  జరగబోయే పరిణామాలను ఊహించటం కూడా కష్టమే. ఎటూ జనబలం లేదు కాబట్టి అటునుండి నరుక్కురావటానికి చంద్రబాబునాయుడు పె...ద్ద ప్లానే వేశారు. అది గనుక వర్కవుటయ్యుంటే చివరకు జగన్ కూడా పులివెందులలో ఓడిపోయేవారేనేమో ?

 

అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ చంద్రబాబు ప్లాన్ చివరి నిముషంలో బెడిసికొట్టింది. దాదాపు ఆరుమాసాలుగా చాలా పకడ్బందీగా వేసిన ప్లాన్ బెడిసికొట్టటాన్ని చంద్రబాబు తట్టుకోలేకున్నారు. అందుకే తన అక్కసునంతా ఎన్నికల కమీషన్, జగన్ పై చూపిస్తున్నారు.  చంద్రబాబు ప్లాన్ మొత్తం ఇపుడిపుడే బయటకు పొక్కుతోంది.

 

ఇంతకీ ఏం జరిగిందంటే  చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఐటి సలహాదారు హరికృష్ణప్రసాద్ ద్వారా మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. ఈ హరిప్రసాద్ ఈవిఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ లో ఎక్స్ పర్ట్. ఈయనతో జిల్లాల కలెక్టర్లను చంద్రబాబు టైఅప్ చేశారు. అంటే హరి ఏమి చెబితే కలెక్టర్లు వినాలంటూ ఆదేశాలిచ్చారట. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన టెక్నాలజీ వినియోగం, సాఫ్టవేర్, ఇంటెర్నెట్ కనెక్షన్లు, కంప్యూటర్ల ఏర్పాట్లలో హరి ప్రసాదే కీలకంగా వ్యవహరించారట.

 

ఇక ఈవిఎంలు ఎలాగూ కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉంటాయి. అందులో భాగంగానే హరిప్రసాద్ తన ఆలోచనలను ఎప్పటికిప్పుడు కలెక్టర్లతో షేర్ చేసుకునేవారట. హరిప్రసాద్ చెప్పినట్లే కలెక్టర్లు కూడా నడుచుకునేవారని తెలుస్తోంది. పోలింగ్ కు ముందురోజు రాత్రి కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఐటి  సలహాదారుతో సుదీర్ఘంగా చర్చించారట.  చంద్రబాబు ప్లాన్  దాదాపు ఆరుమాసాల నుండే అమలవ్వటం మొదలైందట. ఆ విషయం ఒకసారి బయటపడటంతోనే ఎన్నికల కమీషన్ ను మార్చేశారట. అయినా మిగిలిన ఉన్నతాధికారులంతా చంద్రబాబు మనుషులే కావటంతో పోలింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ప్లాన్ జరుగుతునే ఉంది. మొత్తం 175 నియోజకవర్గాల్లోను చంద్రబాబు ప్లానే వర్కవుటవ్వాలి.

 

అయితే, అనూహ్యంగా వీళ్ళ ప్లాన్ బయటపడిందట. దాంతో వెంటనే వైసిపి మేల్కొని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. దాంతో తీగలాగితే డొంక చాలా వరకూ బయటపడింది. అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్పీలను కొందరు కలెక్టర్లను, క్రిందస్ధాయి అధికారులను, పోలింగ్ విధులనుండి టిడిపి నేతల సంస్ధల్లోని ఉద్యోగులను అప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ మార్చేసింది. జరుగుతున్నది చూసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అంటే చంద్రబాబు వేసిన ప్లాన్ వేరు, చివరకు జరిగింది వేరవ్వటంతోనే తట్టుకోలేకపోతున్నారు. నిజంగానే చంద్రబాబు ప్లాన్ వర్కవుటయ్యుంటే పులివెందులలో జగన్ కూడా ఓడిపోయేవారేనేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: