మ‌హిళ‌ల మ‌నోభావాల‌తో చెల‌గాటం ఆడుతున్న వారి ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఒక‌రి త‌ర్వాత మరొక‌రు అన్న‌ట్లుగా ఈ ముఠా ప్ర‌ముఖుల‌ను ఇబ్బంది పెడుతోంది. తాజాగా  సినీనటి పూనంకౌర్‌కు సంబంధించిన అభ్యంతకర వీడియోల విష‌యంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. త‌న‌కు సంబంధించి అభ్యంత‌ర‌క‌ర వీడియోల‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశార‌ని ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంలో పోలీసులు వేగంగా ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.


తాజాగా  సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ అదనపు డీసీపీ రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ, కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. పూనంకౌర్‌ మరోసారి సైబర్‌క్రైమ్‌ ఠాణా కు వచ్చి కేసు వివరాలను పోలీసులకు అందించారన్నారు. ఆమె తొలి ఫిర్యాదులో.. 36 యూట్యూబ్‌ లింకులను పోలీసులకు అందించగా, వాటిలో కొన్ని బుధవారానికి తొలిగించినట్టు గుర్తించామ‌న్నారు. అప్‌లోడ్‌ చేసినవారే తొలిగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నామ‌న్నారు. ఆ వీడియోల ఆధారాలను అప్పటికే సేకరించడంతో కేసు దర్యాప్తు వేగం కానుందని అదనపు డీసీపీ తెలిపారు.


ఇదిలాఉండ‌గా, వైసీపీ నాయకురాలు షర్మిల, నందమూ రి లక్ష్మీపార్వతి తమపై అసత్యప్రచారం చేస్తున్న విషయమై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు గతంలోనే ఫిర్యాదుచేశారు. తాజాగా పూనంకౌర్‌ ఫిర్యాదుచేశారు. ఈ మూడు కేసులకు గల సంబంధాలపై ఆరాతీస్తున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఏపీలో ఎన్నికలకు ముందు పార్టీల నాయకులు యూట్యూబ్‌, సోషల్‌ మీడి యా వేదికగా ఒకరినొకరు కించపరిచిన ఉదంతాలు ఉన్నాయి. ప్రత్య‌ర్థి పార్టీ నాయకుల సంబంధీకులపై దుష్ప్రచారం చేసేందుకు `అధికారం` ఉప‌యోగించుకుంటున్న పార్టీ ఆన్‌లైన్‌లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: