చక్రాలు ఎపుడు పడితే అపుడు అందుబాటులో ఉండవు. వాటి అవసరం పడినపుడు తీసుకునే వారే మొనగాడు. ఈ దేశంలో సంకీర్ణ పాలన ముప్పయ్యేళ్ళ క్రితం మొదలైంది 1989 ఎన్నికల్లో వీపీసింగ్ సారధ్యంలో తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఆ తరువాత వరసగా అదే తంతు సాగింది 2014 ఎన్నికలలో మాత్రం బీజేపీకి తొలిసారిగా పార్లమెంట్లో పూర్తి మెజారిటి  లభించింది. ఇపుడు 2019 ఎన్నికలు జరుగుతున్నాయి.



మరి ఈ ఎన్నికల తీరు చూస్తూంటే మళ్ళీ బీజేపీకి 273 ఎంపీ సీట్లు లభిస్తాయన్న నమ్మకం కమలనాధులకే లేదు. అన్ని రకాల సర్వేలు చూసుకున్నా బీజేపీకి 230 దగ్గరనే నంబర్ ఆగిపోతోంది. అందువల్ల ఏదో విధంగా యాభై సీట్లు కొరత రావడం ఖాయంగా కనీపిస్తోంది. ఈ పరిస్తితుల్లో మోడీ సర్కార్ ని ఆదుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలే ఈసారి ముందుకు వస్తాయని అంటున్నారు. ఏపీలో వైసీపీ, తెలంగాణాలో కేసీయార్, ఒడిషాలో నవీన్ పట్నాయక్ కలుపుకుని 45 నుంచి 50 సీట్లు వరకూ రావచ్చునని ఓ అంచనా ఉంది.



అదే కనుక జరిగితే రేపటి ఎన్నికల తరువాత కేంద్రంలో ఏప్రడే ప్రభుత్వం పూర్తిగా  తెలుగు రాష్ట్రాల మద్దతు మీదనే ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం. ఇక ఏపీలో జగన్ కి ఎలా చూసుకున్నా 15 నుంచి 18 ఎంపీ సీట్లు ఖాయమంటున్నారు. అంటే జగన్ ఇపుడు చక్రధారి కాబోతున్నారన్నమాట. కేంద్రంలోని సర్కార్ షరతులతో కూడిన మద్దతు ఇస్తామని, ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఉంటుందని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. మరి అదే జరిగితే కేంద్రంలో కింగ్ మేకర్ పాత్రను జగన్ పోషిస్తారన్నది తేలుతున్న విషయం. అంటే రేపటి ఎన్నికల తరువాత వైసీపీ ఇటు ఏపీలో అధికారంతో పాటు, అటు జాతీయరాజకీయాల్లోనూ క్రియాశీలకమైన పాత్ర పొషిస్తుందన్న మాట.  



మరింత సమాచారం తెలుసుకోండి: