ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయ‌ణ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు అయింది. అక్ర‌మంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తీరు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు వ్య‌క్తుల ఎంట్రీతో గుట్టు ర‌ట్ట‌యింది. గంట పాటు క‌ల‌క‌లం సృష్టించేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ...ఆయ‌న నిర్వాకం తెలిసిపోయింది.  మంత్రి నారాయణకు చెందిన ఇంట్లో ముగ్గురు బాలకార్మికులకు చైల్డ్‌ప్రొటెక్షన్‌శాఖ అధికారులు విముక్తి కల్పించారు.


వివ‌రాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 46లోని ఆ ఇంట్లో బాలకార్మికులు ఉన్నట్లు కార్మికశాఖకు, బాలల సంరక్షణాధికారులకు, జిల్లా కమిషనర్, ముఖ్యమంత్రితోపాటు ప్రధానికి ఓ వ్యక్తి ఫిర్యాదుచేశారు. దీంతో గురువారం బాలల సంరక్షణ అధికారులు, లేబర్, పోలీస్, రెవెన్యూ, మహిళా, స్త్రీ శిశుసంక్షేమశాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ సంయుక్త ఆధ్వర్యంలో సదరు ఇంటిపై దాడులు నిర్వహించారు. అరగంటపాటు అధికారులను ఇంటి యజమాని లోనికి రానివ్వకుండా అడ్డుకుంది. మీడియాపై కూడా చిందులు తొక్కిడం గ‌మ‌నార్హం. 


అయితే పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని దారిలోకి తెచ్చారు. ఇంట్లో ఉన్న బాలకార్మికులను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. వారికి సంబంధించిన ధ్రువపత్రాలు లేకపోవడంతో ముగ్గురిని పునరావాస కేంద్రానికి తరలించారు. బల్విందర్‌సింగ్ ఇంట్లో బాలకార్మికులు ఉన్నట్లు తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్టు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఇంతియాజ్ చెప్పారు. పిల్లలను ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తీసుకువచ్చారని, అయితే అది రిజష్టర్ అయిందా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: