భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం ముఖేష్ అంబానీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు అన్న‌ట్లుగా ఆయ‌న సిగ్న‌ల్స్ ఇచ్చారు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ దక్షిణ ముంబయి కాంగ్రెస్‌ అభ్యర్థి మిలింద్‌ దియోరాకు మద్దతు పలికారు. ఈ నియోజకవర్గానికి ఆయన సరైన వ్యక్తి అని కొనియాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మిలింద్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. వీడియోలో ముఖేశ్‌.. దక్షిణ ముంబయి నియోజకవర్గానికి మిలింద్‌ పదేళ్ల‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ఇక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాలపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఉన్నదని పేర్కొన్నారు.


గత కొన్ని రోజులుగా అంబానీ సోదరుల మీద కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ముఖేశ్‌ అంబానీ మద్దతు కొత్త చర్చకు తావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రత్య‌క్ష రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకే ముఖేష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? అనే చ‌ర్చ సైతం తెర‌మీద‌కు వ‌స్తోంది.


ఇదిలాఉండ‌గా, కోటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ సైతం మిలింద్ గెలువాలని ఆకాంక్షించారు.మిలింద్ దేవ్‌రా గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ సౌత్ ముంబైలో పోటీకి మిలింద్ సరైన వ్యక్తి. ఆయన పదేండ్లపాటు నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు ఇక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ స్థితిగతులపై, సమస్యలపై లోతైన అవగాహన ఉన్నది అని పేర్కొన్నారు.  ఈ నియోజకవర్గంలో ఈ నెల 29న పోలింగ్ జరగనున్నది. 



మరింత సమాచారం తెలుసుకోండి: