దేశంలోనే అత్యంత సీనియ‌ర్ అని అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా డ‌బ్బా కొట్టుకునే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అడ్డ‌గోలు ప‌నులు చేసి అడ్డంగా బుక్కయ్యారు. త‌న‌తో పాటుగా అధికారుల‌ను సైతం బ‌లి చేసే ప్ర‌య‌త్నం చేశారు. చంద్ర‌బాబు చేష్ట‌ల‌ను గ‌మనించిన ఎన్నిక‌ల క‌మిష‌న్ రంగంలోకి దిగింది. దీంతో తోక‌ముడ‌వ‌టం చంద్ర‌బాబు వంతు అయింది.


వివ‌రాల్లోకి వెళితే....ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే సీఎం హోదాలో చంద్ర‌బాబు సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ ప్రకారం అత్యవసర అంశాలపై చర్చించేందుకు కోడ్‌ పెద్దగా అడ్డురాదు. అయితే ఇతర అంశాలను సమీక్షించకూడదు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లోని 19.6, 19.6.1 నిబంధనల ప్రకారం సీిఎంతో సహా ఇతర మంత్రులు టెలీకాన్ఫరెన్స్‌, సమీక్షలు, ఇతర ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసరమైతే ఈసీ అనుమతి తీసుకోవాలి. దానికి కూడా సమయం లేకపోతే వీడియోలో రికార్డు చేసి ఎన్నికల అధికారికి పూర్తి కాపీని అందచేయాలి. చంద్రబాబు వీటిలో ఒక్కదానిని కూడా అనుసరించలేదు.ఎన్నికల కోడ్‌ ప్రకారం ఈ తరహా సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదని,ఒకవేళ సమీక్షలకు వెళ్లాలనుకుంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే, వీటిలో ఏదీ చంద్ర‌బాబు పాటించ‌లేదు.
దీంతో ఎన్నిక‌ల సీఈఓ గోపాల‌కృష్ణ ద్వివేది సీఈఓను కలిసిన విలేకరులు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షల గురించి ప్రశ్నించారు. దీంతో ఈ అంశంకు సంబంధించి ఉన్న నిబంధనలను సీఈఓ ప‌రిశీలించి త‌గు చ‌ర్య‌లు తీసుకున్నారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యంను కోరారు. ఈ మేరకు సీఈఓ కార్యాలయం నుంచి గురువారం నాడే సీిఎస్‌కు లేఖ వెళ్లింది. చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి హాజరైన అధికారులపైనా చర్యలు తీసుకునే అంశాన్ని అధికారులు పరిశీలి స్తున్నారు. అదే సమయంలో బాబు సమీక్షలు నిర్వహించిన తీరును, ఆ సందర్భంగా ఎన్నికల నిబంధనావళిపై చేసిన వ్యాఖ్యలను సీఈఓ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల అధికారుల స్పందన తెలియడంతో నిర్వహించాల్సిన ఒక సమీక్షను బాబు రద్దు చేసుకున్నారు. అప్పటికే సీఆర్‌డీఏ సమీక్షను ఆయన పూర్తిచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: