ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.  ఎన్నికల సమయంలో ఆయన పార్టీ నుంచి చాలా మంది ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీలోకి జంప్ అయ్యారు.  ఈ నెల 11 పోలింగ్ జరగగా ఓటింగ్ సరళిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు..కాగీ ఈసీ విషయంలో కూడా ఆయన అసహనం వ్యక్తం చేయడంపై పలువురు నేతలు మండి పడ్డారు.  అంతే కాదు ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ..ఉన్నట్టుండి బయటకు వచ్చారు.  అప్పటి నుంచి బీజేపీ, మోడీ పై దుమ్మెత్తి పోస్తున్నారు.  ఎన్నికల సమయంలో ఐటీ దాడులు నిర్వహించగా వారిపై కూడా మండి పడ్డారు.  ఇలా ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసహనం వ్యక్తం చేయడంతో  ప్రతిపక్ష పార్టీలు సైతం మండిపడుతున్నాయి. 

ఆ మద్య చంద్రబాబు ఏన్డీయే కి వ్యతిరేకంగా జాతీయ స్థాయి నాయకులను కలుసుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు..ఆమె కూడా బాబుకి మద్దతు పలికారు.  ఆ మద్య   తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె విశాఖపట్నంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  కానీ ఈ మద్య ఆమో నోటి వెంట కొత్త మాటలు వినిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.  అవసరమైతే చంద్రబాబుకు దూరం కావడానికి కూడా ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు. 

ఢిల్లీలో అధికారమే కేంద్రంగా మమతా బెనర్జీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు నెరుపుతున్నట్లు సమాచారం. ఓ వైపు చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూనే మరోవైపు జగన్ ను తన వైపు తిప్పుకునేందుకు ఆమె పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది.  కేంద్రంలో నాన్ ఎన్డీఎ, నాన్ యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

సాధారణంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని నడపాలంటే.. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఫలితాలే కీలకం అని అందరికీ తెలిసిందే.  మోదీ సైతం ఇక్కడ నుంచి పోటీ చేస్తుంటారు.  ఈ నేపథ్యంలో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, అస్సాం... ఏదైనా కావచ్చు నేతలంతా ఒకతాటి మీదికి వచ్చి కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: