2019 సార్వత్రిక ఎన్నికలు ఏపీలో ముగిసిపోయాయి. ఇక మిగిలింది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అయితే ఇప్పటివరకు అన్ని సర్వేలు, విశ్లేషకులు వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. విజయాల మీదే కాదు - మంత్రి పదవుల విషయంలో కూడా ఆసక్తిదాయకమైన ఆఫ్ ద రికార్డ్ వార్తలు వస్తున్నాయి.  కొందరి విషయంలో అయితే కేబినెట్ బెర్తులు కూడా ఖరారనే మాట వినిపిస్తూ ఉంది!


ప్రత్యేకించి హోం శాఖ విషయంలో ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తూ ఉండటం విశేషం. వాళ్లే కొడాలి నాని - ఆర్కే రోజా. వీళ్లిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున.. హోం శాఖ మంత్రి పదవి రేసులో ఉన్నట్టే అని టాక్.గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా అండగా నిలిచిన వారు వీళ్లు. అంతే కాదు.. తెలుగుదేశం పార్టీ నుంచి బాగా ఆటుపోట్లను ఎదుర్కొన్న వాళ్లు కూడా వీళ్లే.


వీళ్లను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి తెలుగుదేశం గట్టిగా ప్రయత్నించింది.  అందులో భాగంగా చిత్రహింసలు పెట్టినంత పని చేసింది. అయినా ఓర్చుకుని నిలిచిన వీరికి.. ఇప్పుడు జగన్ కీలకమైన మంత్రి పదవినే కేటాయించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే.. జగన్ వీరికి ప్రాధాన్యత కల్పించే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: