ఏపీ ఎన్నికలపై  అంతా తలో మాటా మాట్లాడారు, ఇంకా మాట్లాడుతున్నారు కూడా. కానీ పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకూ ఒక్క మాట కూడా మాట్లాడని వారు ఎవరైనా ఉన్నారా అంటే అది జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన ఇలా పోలింగ్  అయిందో  లేదో అలా హైదరాబాద్ వెళ్ళిపోయారు. కనీసం పోలింగ్ భారీ ఎత్తున జరిగిన దాని మీద మీడియాకు  తన అభిప్రాయం చెప్పలేదు.


పెద్ద సంఖ్యలో మహిళా ఓటర్లు రాత్రి దాటినా ఓటు వేశారు. వారికి వందనాలు చెప్పలేదు. ఈవీఎంలు మొరాయించాయి. వాటికి సంబంధించి కూడా ఏమీ చెప్పలేదు. మొత్తానికి పోలింగ్ ముగిసిన పది రోజులకు ఇవాళ మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఒకటి పెట్టారు. పోలింగ్ సరళి ఎలా ఉందన్నది తెలుసుకోవడానికి పవన్ పెట్టిన ఈ మీటింగునకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, క్రిష్ణా జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్ధులను పిలిపించారు. 


మరి వారి పనితీరు, ఎన్నికల్లో ప్రచారం, గెలుపు అవకాశాలపై పవన్ చర్చించినట్లుగా సమాచారం, దీనితో పాటు, పార్టీకి గెలుపు అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్న దానిపైన కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి తమ పార్టీ బలంపైన పవన్ కి ఓ క్లారిటీ వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి దీని మీద అయినా పవన్ నోరు విప్పి మీడియాతో ఏమైనా పంచుకుంటారా అన్నది చూడాల్సివుంది మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: