ఏపీలో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది. రాయలసీమ నాయకులను అడిగితే వందకు తగ్గవంటారు. కోస్తా జిల్లా నాయకులను అడిగితే గెలుపు మాదే అంటారు. ఉత్తరాంధ్ర వారిని అడిగితే మళ్ళీ సీఎం చంద్రబాబే అంటారు. గోదావరి జిల్లాల వారిని అడిగితే 120 సీట్లు అంటారు. మరి ఇంతకీ ఎంతకు సీట్లు అన్నది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.


ఈ నేపధ్యంలో ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీలో వార్ వన్ సైడ్ అన్నారు. టీడీపీ సునామీ స్రుష్టిస్తోందని చెప్పారు. ఏకంగా 130 సీట్లు పై దాటి తమకు వస్తాయని, ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. 1994 ఎన్నికల్లో అన్న నందమూరి తారక రామారావు ప్రభంజనం వీచిందని, అప్పట్లో మొత్తం 225 సీట్లు వచ్చాయని చెప్పారు. ఈసారి అటువంటి పరిస్థితే ఉంటుందని ఆయన చెప్పారు. ఏపీలో బలంగా టీడీపీ గాలి వీచిందని, తన 36 ఏళ్ళ అనుభవంతో చెబుతున్నానని ఆయన చెప్పారు


అయితే బుచ్చయ్య ఇక్కడో విషయం మరచిపోయారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పాలనకు విసుగెత్తిన జనం అలా అన్న నందమూరిని నమ్మి ఓట్లేశారు. ఇపుడు అయిదేళ్ళ పాటు టీడీపీయే అధికారంలో ఉంది. మరి ఇపుడు అన్న రామారావు కూడా  లేరు. మరో వైపు  బలమైన ప్రతిపక్షం ఉంది. అయినా  కూడా టీడీపీ  సునామీ వస్తే మాత్రం ఈ ప్రజా తీర్పుకు జోహారే. అపుడు బుచ్చయ్య సీనియారిటీని, అనుభవాన్ని తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: