పసుపు కుంకుమ ఓట్లు తమకే పడ్డాయని కాబట్టి టిడిపి గెలపు ఖాయమంటూ చంద్రబాబునాయుడు నాలుగు రోజులుగా  ఒకటే ఊదర గొడుతున్నారు.  ఎంఎల్ఏ, ఎంపి స్ధానాల్లో  పోటీ చేసిన అభ్యర్ధులతో చంద్రబాబు సమీక్ష కూడా నిర్వహించారు. రాబోయే ఫలితాల్లో టిడిపిదే విజయమని అభ్యర్ధుల బుర్రలోకి ఎక్కించటమే చంద్రబాబు ఉద్దేశ్యం. కానీ సమీక్ష తర్వాత టిడిపి ఓటమి ఖాయమన్న విషయంలో అందరికీ స్పష్టత వచ్చినట్లైంది.

 

నిజానికి పోలింగ్ సరళిని చూసిన తర్వాత చంద్రబాబుతో పాటు చాలా మంది నేతలు టిడిపి ఓటమి ఖాయమనే ఫిక్స్ అయ్యారు. అందుకే చంద్రబాబు ఇటు ఎన్నికల కమీషన్ తో పాటు అటు వైసిపి, మోడాని శాపనార్ధాలు పెట్టింది. అయితే ఓ వారం తర్వాత టిడిపిదే విజయమంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు.  130 సీట్లతో టిడిపి అధికారంలోకి రావటం ఖాయమని చెబుతు అదే విషయాన్ని నేతలు, అభ్యర్ధులు కూడా అందరికీ చెప్పాలని ఆదేశించారు.

 

నిజంగానే టిడిపి విజయం ఖాయమైతే ఎవరు ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వాళ్ళుగానే ఆ విషయంపై ఒకటికి పదిసార్లు చెప్పేవాళ్ళే.  సరే ఎవరి గోల ఎలాగున్నా అభ్యర్ధులందరితోను చంద్రబాబు సమీక్ష జరిపి పసుపు కుంకుమ వల్ల ఆడోళ్ళ ఓట్లన్నీ టిడిపికే పడ్డాయని అరిగిపోయిన రికార్డునే  వినిపించారు.

 

అయితే ఇక్కడే అభ్యర్ధుల్లో చాలామంది చంద్రబాబు వాదనతో విభేదించారని సమాచారం. పసుపు కుంకుమ పథకంలో చాలామంది మహిళలకు డబ్బులు అందిన మాట వాస్తవమే కానీ డబ్బులు అందుకున్న వాళ్ళందరూ టిడిపికే ఓట్లేయలేదని చెప్పారట. ఎందుకంటే, డబ్బులందుకున్న ఆడోళ్ళల్లో టిడిపితో పాటు వైసిపి, జనసేన కొన్నిచోట్ల వామపక్షాలకు మద్దతుగా నిలిచే మహిళలు కూడా ఉన్నారని చెప్పారట.

 

ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు ఎవరి పార్టీలకు వాళ్ళు ఓట్లేసుకున్నారని చాలామంది అభ్యర్ధులు చంద్రబాబుకు చెప్పటంతో మైండ్ బ్లాంక్ అయ్యిందట. జరిగిన సమీక్షలో ఏమి తేలిందంటే టిడిపి ఓటమి ఖాయమన్న విషయంపై క్లారిటీ వచ్చిందని టిడిపి నేతలే చెప్పుకుంటున్నారట. అన్నీ నియోజకవర్గాల్లోను వైసిపి పంచిన డబ్బు ఓటరుకు చేరిందని కానీ టిడిపి డబ్బులో కొంతే చేరిందనే క్లారిటీ కూడా వచ్చింది. ఇవికాకుండా సంస్ధాగతంగా టిడిపి పరంగా తప్పులు కూడా జరిగినట్లు అభ్యర్ధులు ఆఫ్ ది రికార్డుగా ఒప్పుకున్నారట. మొత్తానికి చంద్రబాబు సమీక్ష ఎంతపని చేసిందని అనుకుంటున్నారు నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: