కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధి వాచాలత్వానికి కళ్ళెం వేసే పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది కాలంగా ఒకే అంశం పట్టుకుని ఏకంగా దేశ ప్రధాని అన్న గౌరవం లేకుండా నానా మాటలు అంటున్న రాహుల్ కి ఇపుడు అచ్చంగా చుక్కెదురు అవుతోంది. దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు  రాహుల్ నోటికి తాళం వేసే పనికి గట్టిగానే చేపట్టింది. దీంతో ఎన్నికల ప్రచారంలో బురద జల్లుతూ పోతున్న నెహ్రూ వంశపు  వారసునికి దిక్కు తోచడంలేదిపుడు.


చౌకీదారు చోర్ అంటూ ఎడా పెడా రాహుల్ చేస్తున్న ఆరోపణలకు అర్ధం పర్ధం లేదన్నది తెలిసిందే. రాఫెల్ కుంభకోణం అంటూ లేని దాన్ని ఉన్నట్లుగా చూపిస్తూ జనాల్లో మోడీ పాపులారిటీని తగ్గించాలని రాహుల్ పన్నిన పధకం ఎప్పటికపుడు ఫెయిల్ అవుతోంది. దేశంలో మెజారిటీ ప్రజలే కాదు, చదువరులు సైతం దీన్ని నమ్మడం ఎపుడో మానేశారు. నిజానికి రాఫెల్ యుధ్ధ విమానాల విషయంలో ఎటువంటి   అవినీతి జరగలేదని కాగ్ తేల్చేసింది. అంతే కాదు. మూడు శాతం తక్కువ ధరకే ఈ ఒప్పందం కుదిరిందని కూడా పేర్కొంది. 


ఇదిలా ఉండగా చౌకీదార్ చోర్ అంటూ చెప్పుకుపోతున్న రాహుల్ ఆ సరదాలో ఏకంగా సుప్రీం కోర్టుని కూడా లాగేశారు. రాఫెల్ విషయంలో రివ్యూ పిటిషం సుప్రీం కోర్టు పరిగణనలోకి  తీసుకోవడంతో ఏకంగా కోర్టుని కూడా ముగ్గులోకి లాగి మోడీని మరింతగా భ్రష్టు పట్టించాలని రాహుల్ వేసిన పధకం పారలేదు కదా బెడిసికొట్టింది. దీని మీద బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తో రాహుల్ సుప్రీం కోర్టు ధర్మాగ్రహం చూడకతప్పలేదు. సుప్రీం కోర్టుని   ఎందుకు అనవసరంగా లాగుతున్నారంటూ నోటీసులు జారీ చేయడంతో రాహుల్ బాబా వివరణ ఇవ్వక తప్పలేదు.


అయితే  రాహుల్ ఇచ్చిన వివరణ పైసుప్రీం కోర్టు  ఈ రోజు అసంత్రుప్తి వ్యక్తం చేయడం విశేషం. చౌకీదార్ అంటే ఎవరు, కాపలా అంటే సుప్రీం కోర్టు కూడా దేశానికి కాపలాయే కదా అంటూ పేర్కొంటూ సుదీర్ఘ‌మైన వివరణ దీనిపై  కావాలని తాజాగా ఆదేశించడంతో రాహుల్ కి ఎక్కడలేని కష్టం వచ్చిపడింది. ఈ నెల 30లోగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు పేర్కొనడం నిజంగా రాహులు కి దెబ్బే. చౌకీదార్ అన్న మాటనే ఇకపై రాహుల్ బాబా నోటి వెంట లేకుండా చేసుకుంటారా అన్న చర్చ సాగుతోందిపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: