ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడితే పరిస్థితి ఏంటి .. మళ్ళీ చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేదు వయసు లేదు. దీనితో ఆ పార్టీని నడిపించే బాధ్యత ఎవరదని టీడీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ రెండురకాల వర్గాలు తెలుగుదేశంలో ఈ విషయంలో వున్నాయి. ఒకవర్గం లోకేష్ కు ఇచ్చిన ప్రయారిటీ, లోకేష్ కారణంగా అసంతృప్తిలో వున్న సీనియర్లు, వాళ్లను పక్కన పెట్టిన వైనం గురించి మాట్లాడుతున్నాయి.


మరోవర్గం బావ బాలయ్యను సైతం చంద్రబాబు చాలా అసంతృప్తికి గురి చేసాయని అంటోంది. చంద్రబాబు ఓడిపోతే తొలుత గొంతు ఎత్తేది బాలయ్యే అని, బాలయ్య వెనుక ఈ సీనియర్లు వుంటారని స్పెక్యులేషన్లు వినిపిస్తున్నాయి. కూతుర్ని ఇచ్చారు, వియ్యం అందారు. అంతా ఓకె కానీ, బాలయ్యను నొక్కిపెట్టి వుంచారు చంద్రబాబు అని దేశం అభిమానుల్లోని కొంతమంది నోట వినిపిస్తొంది.  నందమూరి వారసుడిగా మంత్రిపదవి ఇవ్వలేదని, కనీసం ఏదో ఒక కీలకపదవి ఇటు పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఇవ్వలేదని వీరు అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయితే, తెలుగుదేశం పార్టీని మళ్లీ నందమూరి కుటుంబ సారథ్యంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


బాబాయ్ చేతిలో పార్టీ వుంటే అబ్బాయ్ ఎన్టీఆర్ కు కూడా సమ్మతమే అని వినిపిస్తోంది. అందువల్ల పార్టీ కనుక ఓటమి చెందితే, బాలయ్య సారథ్యంలోనే పార్టీలో తిరుగుబాటు తప్పదని జోస్యం ఈ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు విషయంలో కన్నా, ఆయన లోకేష్ కు ఇచ్చిన ప్రయారిటీ విషయంలోనే తెలుగుదేశం లోని సీనియర్లు ఎక్కువ అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీలో మొదటి నుంచీ వున్నవారు కూడా వున్నారని బోగట్టా. ఈ విషయం తెలిసే ఇటీవల ఎన్నికలకు కాస్త ముందు నుంచి లోకేష్ ను వీలయినంత లో ప్రొఫైల్ లో చంద్రబాబు వుంచారని టాక్ వినిపిస్తోంది. బాబుగారు కాకపోతే తెలుగుదేశం సారథ్యం అన్నది లోకేష్ చేతిలో వుండడానికి ఆ సామాజిక వర్గానికి చెందినవారికే చాలామందికి ఇష్టం లేదని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: