Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 12:49 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : కర్నాటక రాజకీయాల్లోకి చంద్రబాబు ?

ఎడిటోరియల్ : కర్నాటక రాజకీయాల్లోకి చంద్రబాబు ?
ఎడిటోరియల్ : కర్నాటక రాజకీయాల్లోకి చంద్రబాబు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొంపతీసి చంద్రబాబునాయుడు కన్ను కర్నాటక రాష్ట్ర రాజకీయాలపై పడిందా ఏమిటి ? చంద్రబాబు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే తమ్ముళ్ళల్లో ఇదే అనుమానం మొదలైంది. కర్నాటక ఎన్నికల్లో జెడి ప్లస్ కాంగ్రెస్ తరపున చంద్రబాబు ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తు ‘ఇక నుండి తరచూ కర్నాటకకు వస్తుంటా...అవసరమైతే కన్నడ భాష కూడా నేర్చుకుంటా ’  అంటూ ప్రకటించారు.

 

చంద్రబాబు కర్నాటక పర్యటనలు, కన్నడ భాష నేర్చుకోవటంపై అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, కర్నాటక సరిహద్దునే ఉన్న కుప్పం నుండి చంద్రబాబు దాదాపు 30 ఏళ్ళుగా ప్రతినిధ్యం వహిస్తున్నారు. కుప్పమంటే ఇటు తమిళనాడు, అటు కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దు. అక్కడ జనాలకు దాదాపు తమిళంతో పాటు కన్నడ కూడా వచ్చే ఉంటుంది. 30 ఏళ్ళుగా కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి చంద్రబాబుకు కూడా కన్నడ రాకపోతుందా ? అని అనుకునే వారు.

 

కానీ తాజా ప్రకటనను బట్టి చంద్రబాబుకు కన్నడ రాదని అర్ధమైపోయింది. అలాగే తరచూ కర్నాటకలో పర్యటనలు చేస్తానని కూడా చెప్పారు. ఏపి రాజకీయవేత్తకు కర్నాటకలో తరచూ పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమిటి ? అందుకే చంద్రబాబు కన్ను కర్నాటక రాజకీయాలపై పడిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

 

రేపటి కౌంటింగ్ లో గనుక తెలుగుదేశంపార్టీ ఓడిపోతే చంద్రబాబుకు ఏపిలో ఇబ్బందనే చెప్పాలి. అలాగని తెలంగాణాలో కూడా సౌకర్యంగా ఉండలేరు. మరి అక్కడా ఇక్కడా ఎక్కడా ఉండలేకపోతే మరెక్కడుంటారు ? అందుకే మిత్రుడు, కర్నాటక సిఎం కుమారస్వామితో ఏదో ఒప్పందం చేసుకునే ఉంటారనే అనుమానాలు మొదలయ్యాయి.

 

నిజానికి కర్నాటకలో ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు జనాల నుండి పెద్దగా స్పందన ఏదీ లేదనే చెప్పాలి. ఎందుకంటే, అక్కడ ప్రచారంలో కూడా  ఏపిలో రాజధాని అమరావతి గురించి, తన పాలన గురించే ఊదరగొట్టారు. అదే సమయంలో ఎక్కడ ప్రచారం చేస్తున్నా టార్గెట్ మోడి అన్నట్లే సాగుతోంది చంద్రబాబు ప్రసంగాలు. సరే కర్నాటకలో కూడా తెలుగు జనాలు బాగానే ఉన్నారు కాబట్టి బహుశా కన్నడ రాజకీయాలపై చంద్రబాబు కన్నేశారేమో అనే అనుమానిస్తున్నారు. చూద్దాం కర్నాటక జనాల అదృష్టం ఎలాగుందో ?


chandrababu-karnataka-tour-karnataka-politics-entr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : చంద్రబాబే జగన్ ను హీరోని చేశారా ?
ఎడిటోరియల్ : టిడిపి ఘోర పరాజయానికి చంద్రబాబు చెప్పిన కారణాలు తెలుసా ?
ఎన్టీయార్, జగన్ కు మాత్రమే సాధ్యమైన రికార్డు..ఏంటో తెలుసా ?
గోరంట్ల మాధవ్ ఎంపి కాగానే ఏం జరిగిందో తెలుసా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు ఐరన్ లెగ్గే మిగిలిన పార్టీల కొంప ముంచిదా ?
వైఎస్సార్ ఎల్పీ నేతగా జగన్ ఏకగ్రీవం
వైసిపిలోకి రాపాక జంప్ ? పవన్ కు బిగ్ షాక్ ?
ఎడిటోరియల్ : క్యాబినెట్ లోకి జగన్ పరిశీలిస్తున్న పేర్లివేనా ?
దేశ ఆర్ధిక రాజధానిలో బిజెపిదే హవా
పంజాబ్ లో  నిలదొక్కుకున్న కాంగ్రెస్
గుజరాత్ లో బిజెపి క్లీన్ స్వీప్
ఒడిస్సాలో నవీన్ కే పట్టం
గోవాలో బిజెపికి వచ్చింది సగమే
ఎడిటోరియల్ : చంద్రబాబుకు చుక్కలు చూపించిన చంద్రమౌళి
ఎడిటోరియల్ : బద్దలైన టిడిపి కంచుకోటలు..థ్యాంక్స్ టు చంద్రబాబు
ఎడిటోరియల్ : ఓవర్ యాక్షనే మంత్రుల కొంపముంచిందా ?
ఎడిటోరియల్ : చివరకు ఫిరాయింపుల సంఖ్య కూడా దక్కలేదు
ఏడాది టార్గెట్ గా పెట్టుకున్న జగన్
చంద్రబాబును ఎవరైనా పట్టించుకుంటారా ?
ఎడిటోరియల్ : బద్దలైపోయిన టిడిపి కోటలు...మాడు పగలగొట్టిన జనాలు
పెద్దిరెడ్డి కుటుంబం రికార్డు...ముగ్గురు గెలిచారు
బ్రేకింగ్ న్యూస్ : వైసిపికి మొదటి సీటు డిక్లేర్
బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు రాజీనామా
బ్రేకింగ్ : 26 వైఎస్ ఆర్ ఎల్ఫి కీలక సమావేశం...30 ప్రమాణ స్వీకారం ?
23 ఎంపి, 151 అసెంబ్లీల్లో వైసిపి మెజారిటీ
ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అయితే బంపర్ మెజారిటీనే
భీమవరంలో పవన్ వెనుకంజ
బ్రేకింగ్ :  126 నియోజకవర్గాల్లో  వైసిపికే ఆధిక్యత
ఎడిటోరియల్ : పులివెందులలో చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ?
చాలా ఎక్కువగా మాట్లాడుతోందిగా
ఎడిటోరియల్ : ఒక్క రోజులో ప్రత్యేక విమానంలో ఎన్ని నగరాలు తిరిగారో తెలుసా ?
జగన్ ఇంటి దగ్గర  భారీ భద్రత
తాడేపల్లి చేరుకుంటున్న వైసిపి అగ్రనేతలు
ఎడిటోరియల్ : చంద్రబాబు మంత్రివర్గంలో  గెలిచేదెవరు ?
ఎడిటోరియల్ : ఫలితాల తర్వాత టిడిపిలో చీలిక ఖాయమా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.