తాను మారానని, మునుపటి చద్రబాబునాయుడిని కానని పదే పదే చెప్పుకున్నారు. తాను గతంలో కఠినంగా ఉన్నందుకే ఉద్యోగులు తనపై కసి తీర్చుకున్నారని కూడా చెప్పుకున్నారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి చంద్రబాబులో మార్పేమీ రాలేదని అర్ధమైపోయింది. చంద్రబాబు మునుపటి చంద్రబాబేనని ఆయనకు ఉద్యోగులకన్నా కూడా కాంట్రాక్టర్లంటేనే ముద్దని తేలిపోయింది.

 

ఎలాగంటే ఎన్నికల సమయంలో ఉద్యోగులకివ్వాల్సిన జీత బత్యాలను కూడా నిలిపేసి ఆ డబ్బును కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. దాదాపు 12 శాఖల్లోని సుమారు లక్ష మందికి చెల్లించాల్సిన జీతాలను చంద్రబాబు నిలిపేశారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం నిర్వహించిన ఆర్ధిక శాఖ సమీక్షలో ఈ విషయం బయటపడింది. వివిధ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎయిడెడ్ స్కూళ్ళల్లో టీచర్ల లాంటి పద్దతుల్లో పనిచేస్తున్న చాలా కాటగిరీల ఉద్యోగులందరికీ జీతాలు నిలిపేశారు.

 

ఉద్యోగుల ప్రేమ నిజమే అయ్యుంటే ఇలా లక్షమంది ఉద్యోగుల జీతాలు రూ. 129 కోట్లు నెలల తరబడి ఆపేసేవారేనా ? ఉద్యోగులకు జీతాలను ఆపేస్తే వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతాయని అనుకున్నారో ఏమో. అయినా కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేయాలంటే ఉద్యోగుల జీతబత్యాలే నిలిపేయాలా ? బిల్లులను ఇవ్వటానికంటూ ప్రత్యేకంగా బడ్జెట్ ఉంటుంది కద.

 

సిఎస్ గా ఎల్వీ బాధ్యతలు తీసుకోగానే కొందరు ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకున్నారట. తర్వాత ఎల్వీ చేసిన సమీక్షల్లో అసలు విషయం బయటపడిందట. అందుకనే మిగిలిన శాఖలను కూడా సమీక్షించాలని ఎల్వీ డిసైడ్ అయ్యారు. అందుకనే తమ లోగుట్టును, అవకతవకలను ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనే చంద్రబాబు, యనమల తదితరులు ఎల్వీపై మండిపడుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: