చంద్రబాబు .. మాటలు చూస్తుంటే ఇప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఓటమి భయం కాక మరేమిటని ఏకంగా పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. నిజానికి, ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక చంద్రబాబు, తాను ముఖ్యమంత్రినన్న విషయాన్ని కాస్త పక్కన పెట్టి, పార్టీ గెలుపు మీద ఫోకస్‌ పెట్టి వుండాల్సింది. అధికారులు, ఈవీఎంలు, సీబీఐ, ఈడీ.. ఇలా ఒకటేమిటి.? ఏ ఒక్క అంశాన్నీ చంద్రబాబు వదిలిపెట్టలేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీపై చంద్రబాబు అండ్‌ టీమ్‌ మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.


కొత్త సీఎల్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ ఆరోపణల సంగతి సరే సరి. ఏకంగా, ఎల్వీ సుబ్రహ్మణ్యంను 'దోషి'గా చూపే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. ఇప్పుడేమో, అట్నుంచి 'సమాధానాలు' వస్తోంటే చంద్రబాబుతోపాటు ఆయనకు బాకా ఊదుతోన్న నేతలూ తట్టుకోలేకపోతున్నారు.  'ఇలాంటి దారుణాన్ని నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు' అని చంద్రబాబు వాపోతుంటే, 'ఇలాంటి రాజకీయ నాయకుడ్ని మేం కొత్తగా చూస్తున్నాం..' అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.


ఇంత ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ఊగిపోతున్నారంటే, ఫలితాల మీద చంద్రబాబుకి ఏ స్థాయిలో అనుమానం వుండి వుండాలి. ఓ టీడీపీ ముఖ్య నేత, మీడియాకి అందించిన తాజా లీక్‌ సారాంశమేంటంటే, తెలుగుదేశం పార్టీ అర్థ సెంచరీ దాటడం కష్టమట. నిజానికి, ఇది చాలా సర్వేల్లో తేలిన అంశమే. అయితే, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సదరు ముఖ్య నేత 'లీక్‌' చేసిన ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అన్నట్టు, ఈ వివరాలు చంద్రబాబుకే సదరు ముఖ్యమంత్రి పోలింగ్‌ అయిన వెంటనే అందించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: