అపార్ట్ మెంట్ లైఫ్ పిల్ల‌ల ప్రాణాలు తీస్తోంది. నెల‌కాగానే ల‌క్ష‌ల్లో వ‌సూలు చేస్తున్నంటారు అపార్ట్‌మెంట్ యాజ‌మాన్యాలు.. కానీ అందులో నివ‌సిస్తున్న కుటుంబాల ప్రాణాల ర‌క్ష‌ణ మాత్రం గాల్లోకి వ‌దిలేశారు. ప్ర‌ధానంగా చిన్న పిల్ల‌ల విష‌యంలో అపార్ట్‌మెంట్ల యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఒక బాలుడు క‌రెట్ షాక్‌తో చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న అంద‌ర్ని క‌ల‌చివేసింది. అది మ‌ర‌వ‌క‌ముందే హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్‌లో అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. పిల్ల‌లు ఆడుకునే పార్కులో విరిగిపోయిన బెంచ్ పై ప‌డిన మ‌రో బాలుడు చ‌నిపోయాడు. 

స‌రిగ్గా సాయంత్రం ఐదు గంట‌ల నుంచి ఆరు గంట‌ల ప్రాంతంలో దివిత్ శ‌ర్మ అనే బాలుడు అపార్ట్‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో పార్కులో మిగితా పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకుంటున్నాడు. అయితే ఆడుకుంటూ ప‌క్క‌నే ఉన్న సిమెంబ్ బెంచీపై కూర్చున్నాడు. అయితే ఆ బెంచ్ అప్ప‌టికే విరిగిపోయి ఉంది. ఈ క్ర‌మంలో బాలుడు ఆ బెంచ్ పై ఊగుతూ ఆడుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే ఒక్క‌సారిగా ఆ బెంచ్ బాలుడిపై పడింది. ఈ ఘ‌ట‌న‌తో బాలుడి త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది.. త‌ల‌కు బ‌లంగా గాయం కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే కుప్పకూలిపోయాడు. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు కానీ ఆప్ప‌టికే అంతా జ‌రిగిపోయింది. ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. 

అయితే ఆడే పాడే వ‌య‌సులో ఊహించ‌ని ప్ర‌మాదం బాలుడ్ని బ‌లితీసుకుంది. ఈ పాపం ఎవ‌రిది..?   యాజ‌మాన్యానిదా ? న‌ఇర్వ‌హ‌ణ పేరుతో ల‌క్ష‌లు వ‌సూలు చేసే అపార్ట్‌మెంట్ నిర్వ‌హాకుల‌దా..? అస‌లు వారికి పిల్ల‌లంటే ఎందుకంత అలుసు.. చిన్న పిల్ల‌లు ఆడుకునే ప్రాంతాల్లో కూడా క‌నీస వ‌స‌తులు ఎందుకు చేయ‌డం లేదు..? అంటూ స్థానికులు, ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ల‌క్షలు వ‌సూలు చేస్తున్న వారికి క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా ప‌టించ‌డం లేద‌ని చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే అపార్ట్‌మెంట్ల‌లో నివాసం ఉంటే నెల‌కు అద్దే కాకుండా ఇత‌ర మెయింట‌నెన్స్ అంటూ ఖ‌ర్చులు బారేడవుతాయి. ముఖ్యంగా నిర్శ‌హ‌ణ పేరుతోనే వేల రూపాయ‌లు గుంజేస్తారు. కానీ ఇంత ఖ‌రీదైన అపార్ట్ మెంట్ల‌లో క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌లేకపోతున్నారు. జ‌రగిన ఘ‌ట‌న ప్ర‌మ‌ద‌శాత్తు జ‌రిగిందే కావ‌చ్చు.. కానీ అందులో నిర్వాహ‌కుల నిర్ల‌క్ష్యం స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని స్థానికులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: