టీడీపీ ఆర్ధిక మూలాలకు నారాయణ ప్రతినిధి. టీడీపీ పార్టీకి ఆర్ధికంగా చాలా అండగా ఉన్నాడు. పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచే నారాయణ మరోసారి ఎమ్మెల్సీ అడిగినా చంద్రబాబు కాదనలేని పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్ లో కూడా గొప్పలకు పోయి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఎమ్మెల్యేగా గెలవడానికి నారాయణ పెట్టుకున్న బడ్జెట్ 50కోట్ల రూపాయలు. ఎన్నికలయ్యాక లెక్కలు తీసేసరికి అది 56కి చేరిందని అంటున్నారు.


అయితే ఈ డబ్బులో సగం కూడా ఓటర్లకు చేరలేదు. 20కోట్ల రూపాయలు మాత్రమే నారాయణ డబ్బు ఓటర్ల వరకు చేరింది. మిగతా 36కోట్ల రూపాయలు చోటామోటా నాయకులు మింగేశారని తెలుస్తోంది. అందులోనూ ఓ నలుగురు నారాయణ చుట్టూ చేరి ఆయనకు అరచేతిలో స్వర్గం చూపించారు. ఈ 36కోట్లలో 80శాతం మొత్తాన్ని ఈ నలుగురే సైలెంట్ గా సర్దేశారని నెల్లూరు టాక్. ఈ విషయం నారాయణ వద్దకు కూడా చేరిందట.


చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకని వదిలేసినా.. మనసు ఊరుకోక ఆ నలుగురికీ ఫోన్ చేసి మరీ మీరు నన్ను మోసం చేశారు, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని నారాయణ కడిగేశారట. ఓ మాజీ మంత్రి, ఆయన భార్య, మరో మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు నగరానికి సంబంధించి కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి.. ఇలా ఆ నలుగురు కలసి నారాయణ ఎన్నికల బడ్జెట్ ను మింగేశారు. ఇక నగర పరిధిలోని టీడీపీ కార్పొరేటర్లు కూడా తలో చెయ్యీ వేశారు. నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ ఓడిపోతే అందుకు ప్రధాన కారణం వీరేనని అంటున్నారు. ఒకవేళ డబ్బులు ఓటర్లకు సకాలంలో చేరినా ఫలితాల్లో పెద్ద మార్పేమీ ఉండదు. కానీ, నమ్మించి మరీ టీడీపీ నేతలే నారాయణను ముంచేశారనేది ఇక్కడ హాట్ టాపిక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: