వైసిపి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముందుగా ఏం చేద్దామని అనుకుంటున్నారో తెలుసా ? రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై  శ్వేతపత్రం ప్రకటించటమట. శ్వేతపత్రమంటే చంద్రబాబునాయుడు ప్రకటించిన పద్దతిలో కాదట. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఏ విధంగా దివాలా తీసింది అనే విషయమై సవివరమైన పత్రాన్ని విడుదల చేస్తారట. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడు ఖజానా పరిస్ధితి ఏమిటి ?  ఐదేళ్ళల్లో ఏ శాఖలు ఎంతెంత ఆదాయాలను సంపాదించుకున్నాయి ? శాఖల పేర్లతో జరిగిన వాస్తవ ఖర్చులెంత ? అన్న వివవరాలను శాఖలవారీగా జనాలముందుంచాలని నిర్ణయించుకున్నారట.

 

శ్వేతపత్రమంటే ఐదేళ్ళల్లో  చంద్రబాబు చేసిన ఖర్చులు అందులో దుబారా, అభివృద్ధి, సంక్షేమ శాఖలకు పెట్టిన ఖర్చులు, పద్దుల్లో చూపినట్లు కాకుండా దారిమళ్ళిన కోట్ల రూపాయలు ఇలా...మొత్తం లెక్కలను  జనాలముందుంచుతారన్న మాట.  కేంద్రం నుండి వచ్చిన నిధులు, ఖర్చయిన విధానం తదితరాలన్నీ మళ్ళీ విడిగా చూపిస్తారట.

 

అస్తవ్యస్ధంగా తయారైన రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని, గాడిలో పెట్టాల్సిన ఆవస్యకత తదితారలపై సమగ్ర విధానాన్ని రూపొందించి జనాలు ముందుంచేందుకు  కసరత్తు మొదలైందట.  కోట్ల రూపాయలను అయిన వారికి పప్పు బెల్లాల్లాగ ఖర్చు పెట్టే విషయంలో జగన్ కఠినంగా ఉండక తప్పేట్లు లేదు. ఎక్కడెక్కడ దుబారా జరుగుతోందో, ఎక్కడెక్కడ దుబారానా అరికట్టేందుకు అవకాశాలున్నాయన్న విషయాలపై కసరత్తు జరుగుతోందని సమాచారం.

 

ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించటం ద్వారా మాత్రమే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని గాడిన పెట్టే అవకాశం ఉంది.   ఐదేళ్ళ చంద్రబాబు ఆర్ధిక మేన్మేజ్ మెంట్ ను గమనిస్తే దుబారాను ఎలా అరికట్టవచ్చో తెలిసిపోతుంది. ఏదేమైనా జగన్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను అమలు చేయటం అంత ఈజీ కాదన్న విషయం అర్ధమైపోతోంది.

 

ప్రాధాన్యతా క్రమంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, కేంద్రం నుండి వచ్చే నిధుల విషయంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించకపోతే పరిస్ధితి బాగుపడదు. అందుకనే ఐదేళ్ళల్లో జరిగిన దుబారాను లెక్క తేల్చటానికి ఒక కమిటిని నియమించే ఉద్దేశ్యంలో ఉన్నారు. అలాగే, ఆర్ధిక పరిస్ధితిని చక్కబెట్టేందుకు సూచనలు, సలహాల కోసం మరో కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారట. కమిటీలు వేయకపోతే రోజువారీ పాలనా వ్యవహారాలపై జగన్ దృష్టి పెట్టలేరన్నది వాస్తవం. చంద్రబాబు హయాంలో జరిగిన ఆర్ధికకంపును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా కడగలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: